Operation Sindoor: స్వర్ణ దేవాలయంపై పాక్ టార్గెట్
ABN , Publish Date - May 20 , 2025 | 04:52 AM
భారత సైన్యం పాకిస్తాన్, పీవోకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగా, పాక్ పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. భారత గగనతల రక్షణ వ్యవస్థలతో ఆ దాడులను తేలికగా నిరోధించి, ఆలయాన్ని పూర్తిగా రక్షించింది.
నిర్వీర్యం చేసిన భారత ఎయిర్ డిఫెన్స్
న్యూఢిల్లీ, మే 19: పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీవోకే)ల్లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ నేలమట్టం చేయడంతో.. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని పాక్ టార్గెట్ చేసింది. ఈ నెల 8వ తేదీన దానిపైకి డ్రోన్లు, క్షిపణులను కురిపించింది. అయితే అప్పటికే అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం.. గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో వాటన్నిటినీ నిర్వీర్యం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన 53 సెకన్ల వీడియోను సోమవారం విడుదల చేసింది. 9 స్థావరాల ధ్వంసం గురించి 15వ ఇన్‌ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ) మేజర్ జనరల్ కార్తీక్ సి.శేషాద్రి వివరించారు. ‘స్వర్ణ దేవాలయం మొత్తంపై గగనతల రక్షణ ఛత్రాన్ని ఏర్పాటుచేశాం. ఆలయానికి చిన్నమెత్తు గీత కూడా పడకుండా కాపాడాం. మానవరహిత డ్రోన్లు, క్షిపణులన్నిటినీ భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసం చేసేశాయి. మనవైపు చాలా తక్కువ నష్టం జరిగేలా చూశాయి’ అని వెల్లడించారు.
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి