India Air Defence: భారత సైన్యానికి ఇగ్లా
ABN , Publish Date - May 05 , 2025 | 04:59 AM
భారత ప్రభుత్వం అత్యవసర అధికారాలతో రూ.250 కోట్ల విలువైన రష్యన్ ఇగ్లా-ఎస్ మిసైల్స్‌ను కొనుగోలు చేసి సరిహద్దుల్లో మోహరించింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్ తొలి పరీక్ష విజయవంతమైంది.
రష్యా నుంచి అధునాత క్షిపణుల దిగుమతి
న్యూఢిల్లీ, మే 4: పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. రష్యా నుంచి రూ.250 కోట్ల విలువైన అధునాతన ఇగ్లా-ఎస్ మిసైల్స్ దిగుమతి చేసుకుంది. సైనిక దళాల క్షిపణి సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సైన్యానికి ఇచ్చిన అత్యవసర అధికారాలను ఉపయోగించి వీటిని కొనుగోలు చేశారు. కొన్ని వారాల క్రితమే ఇవి భారత్‌కు చేరుకున్నట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితుల్లో ఇగ్లా-ఎస్ మిసైల్స్‌ను సరిహద్దుల్లో సిద్ధం చేస్తున్నారు. అంతేగాక భారత సైన్యం మరో 48కి పైగా లాంచర్లు, 90 ఇగ్లా-ఎస్ మిసైల్స్ కొనుగోలుకు టెండర్ జారీ చేసింది. భారత సైన్యం 1990 నుంచే ఇగ్లా-ఎస్ మిసైల్స్‌ను ఉపయోగిస్తోంది. తాజాగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవి అధునాతనమైనవి. ఈ స్వల్ప శ్రేణి క్షిపణులతో శత్రు విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లను ధ్వంసం చేయవచ్చు. 3.5 కిలోమీటర్లు ఎత్తు, 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. నిర్దేశిత ప్రాంతాలకు సులభంగా తీసుకెళ్లడానికి, భుజంపై నుంచి గగన తలంలో లక్ష్యాలను కూల్చడానికి అనువుగా ఉంటాయి.
స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం
సైన్యం నిఘా సామర్థాన్ని పెంచేందుకు అభివృద్ధి చేస్తున్న స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్ తొలి విమాన పరీక్షను భారత్ విజయవంతంగా నిర్వహించింది. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో డీఆర్‌డీవో శనివారం ఈ పరీక్షను చేపట్టింది. 62 నిమిషాలపాటు నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన దృశ్యాలను డీఆర్‌డీవో ‘ఎక్స్’లో షేర్ చేసింది. స్ట్రాటో ఆవరణం ఎత్తులో చాలాకాలం పాటు గాలిలో ఎగరగలిగేలా ఈ ఎయిర్‌షి్‌పను రూపొందించినట్టు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. గాలికంటే తేలికైన ప్లాట్‌ఫామ్ వ్యవస్థల సాక్షాత్కారానికి ఈ ప్రొటోటైప్ విమానం ఒక మైలురాయి అని వారు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News