Share News

Trump Tariffs: అమెరికాలో భారత్‌ రెండో ‘లాబీయింగ్‌’ సంస్థ

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:24 AM

మరి కొద్ది రోజుల్లో భారత వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన 50% సుంకాలు అమలుకానున్న వేళ భారత్‌ ఆ దేశంలో రెండో లాబీయింగ్‌ సంస్థను నియమించింది.

Trump Tariffs: అమెరికాలో భారత్‌ రెండో ‘లాబీయింగ్‌’ సంస్థ

వాషింగ్టన్‌, ఆగస్టు 25: మరి కొద్ది రోజుల్లో భారత వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన 50% సుంకాలు అమలుకానున్న వేళ భారత్‌ ఆ దేశంలో రెండో లాబీయింగ్‌ సంస్థను నియమించింది. మాజీ సెనెటర్‌ డేవిడ్‌ విటర్‌కు చెందిన లాబీయింగ్‌ సంస్థ మెర్క్యురీ పబ్లిక్‌ ఎఫయిర్స్‌ని భారత్‌ నూతనంగా నియమించినట్లు ఒక అమెరికన్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఈ సంస్థకు ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. భారత్‌ ఇప్పటికే అమెరికాలో ఎస్‌హెచ్‌డబ్ల్యూ పార్ట్‌నర్స్‌ ఎల్‌ఎల్‌సీ లాబీయింగ్‌ సంస్థను 1.8 మిలియన్‌ డాలర్లకు నియమించింది.


మరోవైపు మెర్క్యురీకి నెలకు 75,000 డాలర్ల చొప్పున మూడు నెలలకు చెల్లించనున్నట్లు సమాచారం. దీంతో మెర్క్యురీ భాగస్వామి, ట్రంప్‌నకు కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌గా పని చేసిన బ్రయన్‌ లాంజా భారత్‌ కోసం పనిచేయనున్నట్లు సమాచారం. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక దాదాపు 30 దేశాలు తమ లాబీయింగ్‌ సంస్థలను అమెరికాలో ఏర్పాటు చేసుకున్నాయి.

Updated Date - Aug 26 , 2025 | 01:24 AM