RTI Act: ఆర్టీఐ దరఖాస్తులకు ఓటీపీతో మెయిల్ ధ్రువీకరణ
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:23 AM
సమాచార హక్కు చట్టం కింద ఇ-మెయిల్ దరఖాస్తులకు జూన్ 16 నుంచి ఓటీపీ ధ్రువీకరణ అమలు చేస్తారు. ఈ చర్య సమాచార భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
న్యూఢిల్లీ, జూన్ 2: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద చేసే అన్ని దరఖాస్తుల ఈ-మెయిల్ ధ్రువీకరణను జూన్ 16 నుంచి వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ద్వారా అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం అధికారిక వెబ్‌సైట్‌లో వ్యక్తిగత, శిక్షణా విభాగం కింద సోమవారం ప్రచురితమైన ఓ సందేశంలో పేర్కొంది. దరఖాస్తుదారుల వివరాలను గోప్యంగా ఉంచడం, సమాచార భద్రతను మెరుగుపరచడంతో పాటు పోర్టల్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి