Share News

Ajit Pawar: ఓట్లు వేస్తేనే నిధులిస్తా.. డిప్యూటీ సీఎం ప్రచార తీరు ఇది

ABN , Publish Date - Nov 22 , 2025 | 09:50 PM

మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి అజిత్ పవార్ స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని మాలేగావ్ జిల్లా మాలేగావ్ పంచాయితీలోని బారామతి తహసిల్‌లో జరిపిన ప్రచారంలో ఓటర్లను ఉద్దేశించి బెదిరింపు తరహా వ్యాఖ్యలు చేశారు.

Ajit Pawar: ఓట్లు వేస్తేనే నిధులిస్తా.. డిప్యూటీ సీఎం ప్రచార తీరు ఇది
ajit pawar

ముంబై: ఓట్ల ప్రచారంలోనూ కొందరు నేతలు ఉత్సుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఒక్కోసారి ఓట్లు అడిగే తీరులోనూ దర్పం చూపిస్తుంటారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని బారామతి తహసిల్‌లోని మాలేగావ్ పంచాయతీ ఎన్నికల కోసం జరిపిన ప్రచారంలో ఓటర్లను ఉద్దేశించి 'బెదిరింపు' తరహా వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, టౌన్ అభివృద్ధికి తనవద్ద ఎలాంటి నిధుల కొరత లేదని చెప్పారు. ఓట్ల వేయకుంటే తన స్పందన కూడా అదే తీరులో ఉంటుందన్నారు. మహారాష్ట్రలోని బీజేపీ-ఎన్‌సీపీ-శివసేన ప్రభుత్వంలో అజిత్ పవార్ ఆర్థిక మంత్రిగా కూడా కొనసాగుతున్నారు.


'స్థానికంగా పోటీ చేసే 18 మంది అభ్యర్థులను గెలిపించండి. మీ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి నిధుల కొరత లేకుండా నేను చూసుకుంటాను. ఇందుకు నాదీ భరోసా. మీరు ఓట్లు తిరస్కరిస్తే, నేను కూడా అదే పనిచేస్తాను. మీ దగ్గర ఓట్లుంటే... నా దగ్గర నిధులు ఉన్నాయి' అని అజిత్ పవార్ అన్నారు.


అజిత్ పవార్ వ్యాఖ్యలపై విపక్ష శివసేన (యూబీటీ) నేత అంబాదాస్ ధన్వే మండిపడ్డారు. ఓటర్లను అజిత్ పవార్ భయపెడుతున్నారని అన్నారు. సామాన్య ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచి నిధులు ఇస్తున్నారే కానీ, అజిత్ పవార్ తన ఇంట్లోంచి సొమ్ములు తీసి ఇవ్వడం లేదన్నారు. పవార్ వంటి నేతలు ఓటర్లను బెదిరిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ఆయన నిలదీసారు. నగర్ పంచాయత్‌ ఎన్నికలు డిసెంబర్ 2న జరగనున్నారు.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీ పేలుడుకు డబ్బులు సమకూర్చిన డాక్టర్లు.. సంచలన విషయాలు వెలుగులోకి

హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదు.. మోహన్ భాగవత్

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 22 , 2025 | 09:56 PM