Delhi Blast: ఢిల్లీ పేలుడుకు డబ్బులు సమకూర్చిన డాక్టర్లు.. సంచలన విషయాలు వెలుగులోకి
ABN , Publish Date - Nov 22 , 2025 | 07:02 PM
కేసులో నిందితులైన డాక్టర్లంతా కలిసి రూ.26 లక్షలు సమకూర్చినట్టు తెలుస్తోంది. డాక్టర్ ముజమ్మిల్ రూ.5 లక్షలు, డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్ రూ.8 లక్షలు, డాక్టర్ ముఫర్ అహ్మత్ రాథర్ రూ.6 లక్షలు, డాక్టర్ ఉమర్ రూ.2 లక్షలు, డాక్టర్ షహీన్ సాహిద్ రూ.5 లక్షలు కంటిబ్యూట్ చేసినట్టు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరమవుతున్న కొద్దీ పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. జైషే ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ దేశవ్యాప్తంగా దాడులకు 2023 నుంచి కుట్రలు పన్నుతున్నట్టు సమాచారం ఇప్పటికే వెలుగులోకి రాగా, ఢిల్లీ పేలుడు కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్లే స్వయంగా సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్‌కు నిధులు సమకూర్చినట్టు తాజాగా వెలుగుచూసింది.
కేసులో నిందితులైన డాక్టర్లంతా కలిసి రూ.26 లక్షలు సమకూర్చినట్టు తెలుస్తోంది. డాక్టర్ ముజమ్మిల్ రూ.5 లక్షలు, డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్ రూ.8 లక్షలు, డాక్టర్ ముఫర్ అహ్మత్ రాథర్ రూ.6 లక్షలు, డాక్టర్ ఉమర్ రూ.2 లక్షలు, డాక్టర్ షహీన్ సాహిద్ రూ.5 లక్షలు కంటిబ్యూట్ చేసినట్టు చెబుతున్నారు. పోగుచేసిన మొత్తం సొమ్మును పేలుడు సామగ్రిని సమకూర్చేందుకు డాక్టర్ ఉమర్‌కు వీరు అందజేశారని దర్యాప్తు అధికారుల సమాచారం.
కుట్రలో ఎవరి పాత్ర ఏమిటి?
అమ్మోనియం నైట్రేట్, యూరియా, ఇతర కీలక సామగ్రిని డాక్టర్ ముజమ్మిల్ సేకరించాడు. రూ.3 లక్షలతో ఎన్పీకే ఫెర్టిలైజర్‌ను కొనుగోలు చేశాడు. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫరీదాబాదాలోని రెండు మార్కెట్ల నుంచి కొన్నాడు. ఆ ఫెర్టిలైజర్‌ను పేలుడు పదార్ధాలుగా డాక్టర్ ఉమర్ మహమ్మద్ మార్చాడు. పేలుడుకు అవసరమైన రసాయనాలు, రిమోట్లు, అవసరమైన పరికరాలను సమకూర్చే బాధ్యత డాక్టర్ ఉమర్ తీసుకున్నాడు. మరోవైపు, అల్-ఫయిదా యూనివర్శిటీ వ్యవహారంపై విస్తృతంగా జరిపిన ఇన్వెస్టిగేషన్లో ల్యాబ్ నుంచి స్టూడెంట్ ప్రాజెక్టుల పేరుతో పలు కెమికల్స్, గ్లాస్‌వేర్ చోరీ అయినట్టు తెలుస్తోంది. అమ్మోనియం నైట్రేట్, టెస్టింగ్ కిట్లు మాయమైనట్టు గుర్తించారు. నిందితులు చిన్న చిన్న మొత్తాల్లో వీటిని బ్యాగులు, వాహనాల్లో యూనివర్శిటీ నుంచి తరలించినట్టు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్, న్యూయార్క్ మేయర్ భేటీపై శశిథరూర్ ఆసక్తికర పోస్ట్
హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదు.. మోహన్ భాగవత్
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.