Pakistan controversy: పాకిస్థాన్ కంటే నరకానికే వెళ్తా
ABN , Publish Date - May 19 , 2025 | 04:43 AM
పాకిస్థాన్‌కు వెళ్లాలా? నరకానికి వెళ్లాలా? అనే ప్రశ్న వస్తే తాను నరకాన్నే ఎంచుకుంటానని బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ఇరుపక్షాల విమర్శలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పుస్తకావిష్కరణ సభలో సినీ గేయ, కథా రచయిత జావేద్ అక్తర్
ముంబై, మే 18: భారత్, పాకిస్థాన్ మఽధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాది దేశంపై ప్రముఖ బాలీవుడ్ సినీ గేయ, కథా రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు వెళ్లాలా? నరకానికి వెళ్లాలా? అన్న ఆప్షన్లు తన ముందుకొస్తే తాను నరకాన్నే ఎంచుకుంటానని పేర్కొన్నారు. శనివారం ముంబైలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. తనపై చాలా మంది ప్రశంసించారని, అదే సమయంలో ఇరుపక్షాల ‘వేర్పాటువాదుల’ నుంచి అవమానాలు, విమర్శలను ఎదుర్కొన్నానని చెప్పారు. ‘నేను నాణేనికి ఒకవైపు చూస్తే నీవు నాస్తికుడి (కఫీర్)వి కనుక నరకాని (జహనుమ్)కి పొమ్మంటుంది. మరోవైపు చూస్తే నువ్వు ఉగ్రవాది (జిహాదీ)వి కనుక పాకిస్థాన్‌కు పొమ్మంటుంది. ఒకవేళ నా ముందు రెండు (పాకిస్థాన్/నరకం) అవకాశాలుంటే నేను నరకానికెళ్లడానికి ఇష్టపడతా’ అని చెప్పారు.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి