Share News

Chennai: కరుణానిధి బాటలోనే నేను.. ప్రాణమున్నంతవరకూ పార్టీ అధ్యక్షుడినే

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:02 PM

‘ప్రాణమున్నంతవరకూ పార్టీకి అధ్యక్షుడిని నేనే, అన్బుమణి కార్యాచరణ అధ్యక్షుడిగానే వ్యవహరించాలి, ఇది నా చిరకాల మిత్రుడు, మాజీ సీఎం కరుణానిధి బాణీ, దాన్నే అనుసరిస్తున్నా’... అని దిండివనం తైలాపురం గార్డెన్‌లో గురువారం ఉదయం విలేకరుల సమావేశంలో పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ పేర్కొన్నారు.

Chennai: కరుణానిధి బాటలోనే నేను..  ప్రాణమున్నంతవరకూ పార్టీ అధ్యక్షుడినే

- స్టాలిన్‌ను చూసి అన్బుమణి నేర్చుకోవాలి

- పీఎంకే చీఫ్‌ రాందాస్‌ ప్రకటన

చెన్నై: ‘ప్రాణమున్నంతవరకూ పార్టీకి అధ్యక్షుడిని నేనే, అన్బుమణి కార్యాచరణ అధ్యక్షుడిగానే వ్యవహరించాలి, ఇది నా చిరకాల మిత్రుడు, మాజీ సీఎం కరుణానిధి బాణీ, దాన్నే అనుసరిస్తున్నా’... అని దిండివనం తైలాపురం గార్డెన్‌లో గురువారం ఉదయం విలేకరుల సమావేశంలో పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌(Dr Ramdas) పేర్కొన్నారు. బుధవారం ఉదయం పీఎంకే శాసనసభ్యుడు అరుళ్‌ను పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా రాందాస్‌ నియమిస్తే, సాయంత్రానికి ఆయన తనయుడు అన్బుమణి రాందాస్‌ అరుళ్‌ నిర్వహిస్తుండిన జిల్లా కార్యదర్శి పదవి నుంచి డిస్మిస్‌ చేశారు.

ఇలా తండ్రీతనయుడు పార్టీలో మార్పులు చేర్పులూ చేస్తుండటంతో పార్టీ శ్రేణులంతా అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో రాందాస్‌ తైలాపురం గార్డెన్‌లో మీడియా మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వీల్‌చైయిర్‌కే పరిమితమైనా డీఎంకే అధ్యక్షపదవి నుండి తప్పుకోలేదని, అప్పట్లో స్టాలిన్‌ పార్టీ అధ్యక్ష పదవి కోసం పాకులాడకుండా హుందాగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఈ విషయంలో స్టాలిన్‌ను చూసి అన్బుమణి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.

మురుగన్‌ మహానాడులో పెరియార్‌, అన్నాదురైని కించపరిచే వీడియోలను ప్రదర్శించడం గర్హనీయమన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ సర్వసభ్యమండలి సమావేశాన్ని జరుపుతానని, అంతకంటే ముందు పార్టీ కార్యాచరణ, నిర్వాహక కమిటీ సమావేశాలను జరిపి, సభ్యులు అభిప్రాయాలను తెలుసుకుంటానన్నారు. ఎన్నికల వ్యూహరచనలు, కూటమి ఏర్పాటు, చేరడం వంటి నిర్ణయాలను తీసుకుంటానని స్పష్టం చేశారు. సర్వసభ్యమండలి సమావేశం జరిగేటప్పుడే పార్టీ యువజన విభాగం అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

nani3.2.jpg

అన్బుమణి పార్టీ అధ్యక్ష పదవికోసం పట్టుబడుతున్నారని విలేకరులు ప్రశ్నించగా... ప్రస్తుతం తానిచ్చిన పార్టీ కార్యాచరణ అధ్యక్షుడి పదవిని శిరసావహించి నిర్వహిస్తానని ప్రకటిస్తే పార్టీలో ఏ సమస్య ఉండదన్నారు. మూడేళ్లపాటు అన్బుమణి పార్టీ అధ్యక్షపదవిలో కొనసాగారు కదా మళ్లీ ఆ పదవిపై ఎందుకు ఆరాటపడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. తాను పదవుల కోసం పాకులాడేవాడిని కానని, పదవులే కావాలనుకుని ఉంటే కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొంది ఉండేవాడినని రాందాస్‌ చెప్పుకొచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి.

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 27 , 2025 | 12:02 PM