Share News

Dogs: అబ్బో.. ఈ ఐడియా ఏదో బాగానే ఉందిగా.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:33 AM

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలువురు వీధి కుక్కల బారిన పడుతున్నారు. కుక్క కాటుకు సరైన వైద్యం పొందక రేబిస్‏తో మృతిచెందిన ఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. వీధి కుక్కల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినా, కుక్కలు ప్రజలపై దాడిచేయడం మాత్రం కొనసాగుతూనే ఉంది.

Dogs: అబ్బో.. ఈ ఐడియా ఏదో బాగానే ఉందిగా.. విషయం ఏంటంటే..

- నీలిరంగు నీటికి వీధికుక్కలు భయపడతాయా...

- హోసూరు ప్రజల వినూత్న ఆలోచన

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలువురు వీధి కుక్కల బారిన పడుతున్నారు. కుక్క కాటుకు సరైన వైద్యం పొందక రేబిస్‏తో మృతిచెందిన ఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. వీధి కుక్కల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినా, కుక్కలు ప్రజలపై దాడిచేయడం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో, కృష్ణగిరి(Krishnagiri) జిల్లా హోసూరు పట్టణ ప్రజలు వీధి కుక్కల బెడద నుంచి కాపాడుకునేలా సరికొత్త ఆలోచన చేశారు.


dog-colour.jpg

హోసూరు(Hosur) కార్పొరేషన్‌ పరిధిలోని 45వ వార్డులో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వెళ్లే వారు వీధి కుక్కలు ఎక్కడ దాడిచేస్తాయోనని హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో, ఆ ప్రాంత ప్రజలు, దుస్తులు ఉతికేందుకు వినియోగించే నీలిరంగును నీటిలో కలిపి బాటిళ్లలో పోసి ఇళ్ల ముందుంచుతున్నారు. ఆ నీటిని చూసిన కుక్కలు భయపడి ఈ ప్రాంతానికి రావడం లేదని ప్రజలు తెలుపుతున్నారు.

నీలి రంగు బాటిల్ ట్రిక్ వీడియోను ఇక్కడ చూడండి


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా

Read Latest Telangana News and National News

Updated Date - Sep 21 , 2025 | 12:58 AM