Himachal Pradesh: భారీ వర్షాలతో ముగ్గురి మృతి
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:37 AM
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీవర్షాలు కుదిపేస్తున్నాయి. ఈ కారణంగా 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు.
సిమ్లా, జూన్ 30: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీవర్షాలు కుదిపేస్తున్నాయి. ఈ కారణంగా 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఈ ఏడాది వర్షాల కారణంగా హిమాచల్‌లో మరణాల సంఖ్య 20కి పెరిగింది. సిమ్లాలో 5 అంతస్తుల ఓ భవనం సోమవారం కుప్పకూలింది. అందులో నివాసం ఉంటున్నవారు ముందుగానే బయటపడడంతో ఎవరికీ ప్రమాదం వాటిల్లలేదు. భారీవర్షాల కారణంగా రాష్ట్రంలోని 259 రోడ్లను మూసివేశారు. సోలన్‌లో ఒక వంతెన కొట్టుకుపోయింది.
రాష్ట్రంలోని 130 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాంగ్రా, మండి, సిర్మార్, సోలన్ జిల్లాల్లో సోమవారం పాఠశాలలను మూసివేయాల్సిందిగా సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఆదేశించారు. సిమ్లా-కాల్కా రైల్వే లైనులో భారీ వర్షాలకు ట్రాక్‌పై బండరాళ్లు పడడంతో రైళ్లు నడవలేదు.