Gaza airstrikes: గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 103 మంది మృతి
ABN , Publish Date - May 19 , 2025 | 05:22 AM
ఇజ్రాయెల్ గాజా స్ర్టిప్‌పై భారీ వైమానిక దాడులు నిర్వహించి 103 మందిని చంపింది. ఉత్తర గాజాలో ప్రధాన ఆస్పత్రిని మూసివేసి, హమాస్‌పై తాత్కాలిక కాల్పుల విరమణకు ఒత్తిడి పెంచుతోంది.

గాజా, మే 18: పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. గాజా స్ర్టిప్ వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జరిపిన వైమానిక దాడుల్లో 103 మంది మరణించారు. ఉత్తర గాజాలోని ప్రధాన ఆస్పత్రిని సైతం మూసివేశారు. ఇజ్రాయెల్ సూచించిన షరతుల మేరకు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ ఒప్పుకొనేలా ఒత్తిడి పెంచే ప్రణాళికలో భాగమే తాజా భీకర దాడులు. ఖాన్‌యూనిస్ నగరంలోనూ, దాని చుట్టుపక్కల జరిపిన దాడుల్లో ఇళ్లు, పునరావాస టెంట్‌లు ధ్వంసమవడంతో 48 మందికిపైగా మరణించారు. మృతుల్లో 18 మంది చిన్నారులు, 13 మంది మహిళలు ఉన్నారని నస్సెర్ ఆస్పత్రి అధికార ప్రతినిధి వీం ఫేర్స్ చెప్పారు. ఉత్తర గాజాలోని ఇండోనేసియన్ ఆస్పత్రి చుట్టూ దాడులు జరగడంతో ఆస్పత్రిని మూసివేసినట్టు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉత్తర గాజాలో క్షతగాత్రులకు వైద్యసేవలు అందిస్తున్న ప్రధాన ఆస్పత్రి ఇదే. తాజాగా హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించారు. దీంతో ఆదివారం ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో సైరన్‌ల మోత మోగింది.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి