Jyoti Malhotra: పహల్గాం’కు ముందు జ్యోతి పాక్‌లోనే
ABN , Publish Date - May 19 , 2025 | 05:18 AM
పాక్ గూఢచారి నెట్‌వర్క్‌తో సంబంధాలున్న హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పహల్గాం ఉగ్రదాడికి ముందు పాకిస్థాన్‌లో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె పరికరాలు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ జరుపుతుండగా, ఈ గూఢచర్య వ్యవహారం ఒడిశా వరకు విస్తరించినట్లు అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీ, మే 18: పాకిస్థాన్ ఏజెంట్లతో కలిసి గూఢచర్యానికి పాల్పడ్డ హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతిమల్హోత్రా(34) వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గాం ఉగ్ర దాడికి ముందు ఆమె పాకిస్థాన్‌లోనే ఉందని హరియాణాలోని హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. తరచూ ఆమె పాక్ పర్యటనలకు వెళ్లారని, ఒకసారి చైనా పర్యటనకూ వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ జ్యోతి మల్హోత్రా పాక్ ఏజెంట్లతో టచ్‌లో ఉన్నారని హిస్సార్ ఎస్పీ చెప్పారు. పోలీసులు ఆమె ఫోన్, లాప్‌టాప్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నారు. కాగా, గతేడాది మే నెలలోనే కపిల్ జైన్ అనే ‘ఎక్స్’ వినియోగదారు జ్యోతిపై దృష్టి సారించాలని ఎన్‌ఐఏను కోరుతూ ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం విశేషం. ఆమె తొలుత పాక్ ఎంబసీలో ఫంక్షన్‌కు హాజరైందని, తర్వాత పాక్ పర్యటనకు వెళ్లిందని, అనంతరం కశ్మీర్ పర్యటనకూ వెళ్లనుందని... దీని వెనుక ఏదో ఉందని అందులో పేర్కొన్నారు. మే 7వ తేదీ నుంచి ఇప్పటివరకు పంజాబ్, హరియాణాల్లో మొత్తం ఏడుగురిని గూఢచర్యం కేసులో అరెస్టు చేశారు. ఈ గూఢచర్యం వ్యవహారం ఒడిశా రాష్ట్రానికీ చేరింది. ఒడిశాలో పూరీకి చెందిన ఓ మహిళా యూట్యూబర్‌కు జ్యోతి మల్హోత్రాతో పరిచయం ఉంది. జ్యోతి 2024 సెప్టెంబరులో పూరీని సందర్శించారు. పూరీకి చెందిన యూట్యూబర్ ఇటీవలే పాక్‌లోని కర్తార్‌పూర్ గురుద్వారాను సందర్శించారు.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి