Share News

Murder Mystery: మామ అకృత్యం, కోడలిపై అత్యాచారం, హత్య

ABN , Publish Date - Jun 27 , 2025 | 03:48 PM

సొంత కోడలిపై అత్యాచారం చేసి, ఆపై హత్యచేసిన ఒక కిరాతక మామ అకృత్యం వెలుగులోకి వచ్చింది. అనంతరం కొడుకు, భార్య సహకారంతో కోడల్ని రోడ్డు బయట తవ్విన గోతిలో పాతిపెట్టి పైన కాంక్రీట్ వేసి, తమ కోడలు కనిపించటంలేదంటూ..

Murder Mystery: మామ అకృత్యం, కోడలిపై అత్యాచారం, హత్య
Man Raped Daughter-In-Law

హర్యానా, ఫరీదాబాద్ జూన్ 27, 2025: కోడలికి భోజనంలో మత్తుమందు కలిపి, ఆపై అత్యాచారం చేసి చంపేసిన ఒక మామ కిరాతకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ హత్యకు సంబంధించి విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఏప్రిల్‌లో కోడలి హత్య జరగ్గా, ఆమె అత్తమామలు.. తమ కోడలు తప్పిపోయిందని ఫిర్యాదు చేయడంతో దాదాపు రెండు నెలలుగా ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలించారు. ఫిరోజాబాద్ జిల్లాలోని షికోహాబాద్‌కు చెందిన బాధితురాలు, జూలై 2023లో ఫరీదాబాద్‌లో వివాహం చేసుకుంది.

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, కస్టడీలో హతురాలి మామ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు మూడు రోజుల రిమాండ్‌లో ఉన్నాడు. కాగా, కోడలిని చంపే ప్లాన్ ఏప్రిల్ 14, 2025న ఖరారు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పక్కా ప్లాన్‌లో భాగంగా, ఆమె అత్తగారిని ఉత్తరప్రదేశ్‌లోని ఎటాలో జరిగిన వివాహానికి హాజరు కావడానికి పంపారు. ఏప్రిల్ 21 రాత్రి, బాధిత మహిళ భర్త ఆమెకు, అతని చెల్లికి ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో వేర్వేరు అంతస్తులలోని గదుల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

Lady-Murder.jpg


ఈ క్రమంలో మామ అనుకున్నట్టుగా, అర్థరాత్రి రహస్యంగా కోడలి గదిలోకి వెళ్లాడు. హత్యకు ముందు అతను అపస్మారక స్థితిలో ఉన్న తన కోడలిపై అత్యాచారం చేశాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, అత్యాచారం విషయాన్ని మామ.. తన కొడుకు, భార్యతో చెప్పలేదని పోలీసులు అంటున్నారు. హత్య తర్వాత, మామ తన కొడుకును మేడమీదకు పిలిచాడు. వారిద్దరూ కలిసి ఆ మహిళ మృతదేహాన్ని చుట్టి, ఇంటి వెలుపల ఉన్న వీధిలో అప్పటికే తవ్విన గొయ్యిలో పడేశారు. ఇరుగుపొరుగు వారంతా డ్రైనేజ్ పనుల్లో భాగంగా తవ్విన గుంతగా మాత్రమే దానిని భావించారు. తర్వాత మట్టి, ఇటుకలు వేసి కొన్ని రోజుల తర్వాత దానిపై కాంక్రీట్ స్లాబ్ వేసేశారు.

Lady-Murder-2.jpgవిషయం తెలుసుకున్న పోలీసులు ఆ గుంతను తవ్వి, పాక్షికంగా కుళ్ళిపోయి ఉన్న మహిళ మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం పంపిచారు. మామ, అత్త, భర్తతో పాటు, బాధితురాలి వదిన, నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక, బాధితురాలి సోదరి చెబుతున్న వివరాల ప్రకారం.. పెళ్లైన నాటి నుంచీ అధిక కట్నకానుకల కోసం అత్తమామలు తమ సోదరిని తీవ్ర వేధింపులకు గురిచేశారని చెప్పింది. ఆ బాధలు భరించలేక పెళ్లైన తర్వాత ఏడాది పాటు, తన అక్క పుట్టింటిలోనే ఉండిపోయిందని వాపోయింది. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పేలిన ఎలక్ట్రిక్ బైక్.. మహిళ మృతి

మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 27 , 2025 | 04:03 PM