Share News

Hafiz Saeed : మీరు నీళ్లు ఆపేస్తే మేము మీ ఊపిరి ఆపేస్తాం

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:44 AM

2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ తాజాగా ఒక పాత వీడియోను ప్రచారంలో పెట్టి, భారత్‌ను బెదిరించారు. ‘‘మీరు నీళ్లు ఆపిస్తే, మేము మీ ఊపిరి ఆపిస్తాం’’ అంటూ అతను వ్యాఖ్యానించాడు

Hafiz Saeed : మీరు నీళ్లు ఆపేస్తే మేము మీ ఊపిరి ఆపేస్తాం

  • హఫీజ్‌ సయీద్‌ భారత్‌ను బెదిరిస్తున్న పాత వీడియో వైరల్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 : పహల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత్‌ సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్థాన్‌ పరోక్ష బెదిరింపులకు దిగింది. 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తాయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌.. సింధు జలాల అంశంలో భారతదేశాన్ని, ప్రధాని మోదీనీ తీవ్రంగా హెచ్చరిస్తున్న ఓ పాత వీడియోను బయటకు తీసింది. ‘‘మీరు పాకిస్థాన్‌కు నీళ్లు ఆపేస్తే, మేము మీ ఊపిరి ఆపేస్తాం. నదుల్లో రక్తం పారుతుంది’’ అంటూ హఫీజ్‌ సయీద్‌ ఓ బహిరంగ సభలో భారత్‌ను హెచ్చరించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసింది.

Updated Date - Apr 26 , 2025 | 03:45 AM