Gun Violence: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Apr 18 , 2025 | 07:34 AM
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడాలోని తలహసీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా (America)లో మరోసారి కాల్పుల (Shooting) ఘటన కలకలం రేగింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ (Florida State University)లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి (2 Dead) చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు (6 Injured). వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు (Police) దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనతో యూనివర్శిటీ విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు.
Also Read..: 11 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా..
తలహాసీ క్యాంపస్‌లోని స్టూడెంట్స్ యూనియన్‌లో షూటర్ ఉన్నట్లు మొదట సమాచారం రావడంతో యూనివర్శిటీ వెంటనే అప్రమత్తమైంది. విద్యార్థులు, ఫ్యాకల్టీ సిబ్బంది వెంటనే వర్శిటీని వదలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచిస్తూ.. పోలీసులకు సమాచారమిచ్చింది. వెంటనే వర్శిటీకి వచ్చిన పోలీసులు, ఇతర ఏజెన్సీలు సహాయక చర్యలు చేపట్టాయి. అటు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అధికారులు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న క్యాంపస్‌లో ఒక్కసారిగా కాల్పులు శబ్దానికి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన అనంతరం మొత్తం క్యాంపస్‌ను లాక్‌డౌన్ చేశారు. ఈ కాల్పులకు పాల్పడింది లియోన్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ జెస్సికా ఇక్నర్ కుమారుడిగా పోలీసులు గుర్తించారు. ఇక్నర్ (20) తన తల్లికి చెందిన మాజీ సర్వీస్ ఆయుధాన్ని ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా యూనివర్శిటీలో జరగాల్సిన తరగతులు, క్రీడా కార్యక్రమాలు, ఇతర ఈవెంట్‌లు రద్దు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్ ఆస్తులు జప్తు
ఆ పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వబోం..
For More AP News and Telugu News