Share News

అమెరికాకు అక్రమంగా వెళ్తూ గుజరాత్‌వాసి మృతి

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:50 AM

అమెరికాకు అక్రమంగా వెళ్తూ గుజరాత్‌వాసి ఒకరు మార్గమధ్యమంలోని నికరాగువా దేశంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు వెళ్లిన భార్యాపిల్లలు అక్కడ నిస్సహాయంగా మిగిలిపోయారు.

అమెరికాకు అక్రమంగా వెళ్తూ గుజరాత్‌వాసి మృతి

న్యూఢిల్లీ, మార్చి 11: అమెరికాకు అక్రమంగా వెళ్తూ గుజరాత్‌వాసి ఒకరు మార్గమధ్యమంలోని నికరాగువా దేశంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు వెళ్లిన భార్యాపిల్లలు అక్కడ నిస్సహాయంగా మిగిలిపోయారు. సరయిన పత్రాలు లేని వారు నికరాగువా దేశం మీదుగా అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లడాన్ని డంకీ రూట్‌గా వ్యవహరిస్తుంటారు. గుజరాత్‌లోని సనర్‌కాంతా జిల్లా మోయద్‌ గ్రామానికి చెందిన దిలీప్‌ పటేల్‌ కూడా ఈ డంకీ రూట్‌ను ఎంచుకొని చివరికి ప్రాణాలు కోల్పోయాడు.


రూ.కోటి ఇస్తే అమెరికాకు తీసుకెళ్తానని ఓ ఏజెంటు చెప్పడంతో పొలాలు అమ్మి అంతమొత్తాన్ని అతడికి ఇచ్చాడు. రెండు నెలల క్రితం భార్య, బిడ్డతో కలిసి టూరిస్టు వీసా మీద దుబాయ్‌ వెళ్లాడు. అక్కడి నుంచి నికరాగువా చేరుకున్నారు. మార్గంమధ్యలో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు.

Updated Date - Mar 12 , 2025 | 05:50 AM