Share News

Vijay Rupani: విమాన ప్రమాదం.. మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు

ABN , Publish Date - Jun 15 , 2025 | 01:44 PM

Air India Plane Crash: అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయి. వైద్యుల బృందం చనిపోయిన వారి కుటుంబసభ్యుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహిస్తోంది. డీఎన్‌ఏ టెస్టుల ద్వారా నిన్నటి వరకు 15 మందిని గుర్తించారు.

Vijay Rupani: విమాన ప్రమాదం.. మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు
Air India plane crash

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చాలా మంది గుర్తుపట్టలేనంతగా కాలిపోయి చనిపోయారు. ఎవరి బాడీ ఎవరిదో గుర్తించటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షలతో మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయి. వైద్యుల బృందం చనిపోయిన వారి కుటుంబసభ్యుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహిస్తోంది. డీఎన్‌ఏ టెస్టుల ద్వారా నిన్నటి వరకు 15 మందిని గుర్తించారు.


తాజాగా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని వైద్యులు గుర్తించారు. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విమానం ప్రమాదంలో విజయ్ రూపానీ కూడా చనిపోయారు. లండన్‌లో ఉన్న కుటుంబసభ్యుల్ని కలుసుకోవడానికి వెళుతూ మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. విజయ్ రూపానీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్ రూపానీ ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యుల్ని పరామర్శించారు.


274కు చేరిన మృతుల సంఖ్య

అహ్మదాబాద్ టు లండన్ వెళుతున్న ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది చనిపోయారు. మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు, స్థానిక ప్రజలు కూడా చనిపోయారు. దీంతో విమాన ప్రమాద మృతుల సంఖ్య 274కు చేరింది.


ఇవి కూడా చదవండి

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. రంగంలోకి యూకే

Updated Date - Jun 15 , 2025 | 01:49 PM