Share News

GST Reforms: ఎప్పటి నుంచో జీఎస్టీ సంస్కరణలపై కసరత్తు

ABN , Publish Date - Sep 07 , 2025 | 06:01 AM

జీఎస్టీ సంస్కరణలకు, దేశం బయట నెలకొన్న పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు....

GST Reforms: ఎప్పటి నుంచో జీఎస్టీ సంస్కరణలపై కసరత్తు

  • వాటికి, బయటి విషయాలకు సంబంధం లేదు: అశ్వినీ వైష్ణవ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ సంస్కరణలకు, దేశం బయట నెలకొన్న పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. ఏడాదిన్నర క్రితమే.. అమెరికా ఎన్నికలకు ముందే జీఎస్టీ సంస్కరణలపై కసరత్తు మొదలైందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలకు, ఇటీవల భారత వస్తువులపై అమెరికా అధిక సుంకాలు విధించడానికి సంబంధం ఏదైనా ఉందా అన్న ప్రశ్నకు ఆయన ఈ వివరణ ఇచ్చారు. శనివారం ఆయన బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దసరా నవరాత్రుల మొదటి రోజైన ఈ నెల 22 నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తాయని, ఇవి ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తాయని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం నెరవేరిందన్నారు. రోజువారీ వినియోగించే వస్తువులు అన్నింటిపై జీఎస్టీ తగ్గుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్

For More National News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 06:01 AM