Two Youth Exhuming Womans Body: నగ్నంగా శ్మశానంలోకి ప్రవేశించి.. మహిళ శవాన్ని బయటకు తీసి..
ABN , Publish Date - Sep 23 , 2025 | 06:54 AM
నిమిషాల్లో పెద్ద సంఖ్యలో జనం శ్మశానానికి చేరుకున్నారు. పోలీసులకు కూడా సమాచారం వెళ్లింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితి సమీక్షించారు.
మధ్య ప్రదేశ్‌లో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. శ్మశానంలోకి ప్రవేశించిన ఇద్దరు యువకులు రెండు సమాధుల్లోంచి శవాలను బయటకు తీశారు. ఏం చేశారో ఏమో తెలీదు కానీ, కొన్ని గంటల తర్వాత ఆ రెండు శవాలను సమాధుల బయట పడేసి పోయారు. ఇదంతా ఒంటిపై దస్తులు లేకుండానే చేశారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖంద్వా నగరంలోని బడా ఆవార్ ప్రాంతంలో ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఓ పెద్ద శ్మశాన వాటిక ఉంది. ఆదివారం రాత్రి ఓ ఇద్దరు యువకులు ఒంటి మీద దుస్తులు లేకుండా శ్మశానంలోకి ప్రవేశించారు. తాము చేసే పని ఎవ్వరికీ తెలియకుండా ఉండటానికి ఓ యువకుడు అక్కడి సీసీటీవీ కెమెరాకు అడ్డంగా గుడ్డ ముక్కను పెట్టాడు.
తర్వాత శ్మశానంలో కలియతిరిగారు. రెండు రోజుల క్రితం పాతిపెట్టిన ఓ మహిళ సమాధిని తవ్వారు. శవాన్ని బయటకు తీశారు. తర్వాత ఓ పాత సమాధిని కూడా తవ్వి శవాన్ని బయటకు తీశారు. ఆ రెండు శవాలను బయటకు తీసి వారు ఏం చేశారో అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. ఆ ఇద్దరు యువకులు కొన్ని గంటల తర్వాత రెండు శవాలను సమాధుల బయట పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం శ్మశానం వైపు వచ్చిన ఓ వ్యక్తి శవాలు బయట పడి ఉండటం చూశాడు. వెంటనే ఊర్లో వాళ్లకు సమాచారం ఇచ్చాడు.
నిమిషాల్లో పెద్ద సంఖ్యలో జనం శ్మశానానికి చేరుకున్నారు. పోలీసులకు కూడా సమాచారం వెళ్లింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితి సమీక్షించారు. గ్రామస్తులు మళ్లీ ఆ రెండు శవాలను సమాధుల్లో పాతిపెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులను విచారిస్తున్నారు. కాగా, గత మే 20వ తేదీన కూడా ఆ శ్మశానంలో ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అప్పుడు ఏకంగా ఆరు సమాధుల్ని దుండగులు తవ్వి శవాలను బయటకు తీశారు. దీంతో భయపడిపోయిన ముస్లిం కమ్యూనిటీ శ్మశానంలో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి
విమానం ల్యాండింగ్ గేర్ బాక్సులో అఫ్ఘాన్ బాలుడి సాహసం
తగ్గే ఆదాయాన్ని కేంద్రమే భరించాలి