Share News

Viksit Bharat 2047: ‘వికసిత్‌ భారత్‌’లో కార్మికులది కీలకపాత్ర

ABN , Publish Date - Feb 23 , 2025 | 05:32 AM

ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్‌ భారత్‌ 2047 కలను సాకారం చేసేలా అన్ని రంగాల్లో దేశాన్ని ఆత్మ నిర్భర్‌ భారత్‌ దిశగా శరవేగంగా అడుగులు వేసేందుకు కార్మికుల భాగస్వామ్యం అవసరమన్నారు.

Viksit Bharat 2047: ‘వికసిత్‌ భారత్‌’లో కార్మికులది కీలకపాత్ర

కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్‌ భారత్‌ 2047 కలను సాకారం చేసేలా అన్ని రంగాల్లో దేశాన్ని ఆత్మ నిర్భర్‌ భారత్‌ దిశగా శరవేగంగా అడుగులు వేసేందుకు కార్మికుల భాగస్వామ్యం అవసరమన్నారు. శనివారం భువనేశ్వర్‌లో నిర్వహించిన భారతీయ మజ్దూర్‌ సంఘ్‌(బీఎంఎస్‌) అనుబంధ పారిశ్రామిక విభాగానికి చెందిన పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ శ్రమ్‌ పోర్టల్‌లో ఇప్పటి వరకు 30 కోట్ల మంది కార్మికులు పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. 70 ఏళ్లుగా శ్రామికులు, కార్మికుల పక్షాన ఉంటూ, వారి కోసం పనిచేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంస్థ బీఎంఎస్‌ అన్నారు.


ఇవి కూడా చదవండి..

Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..

Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2025 | 05:32 AM