India Press briefing: ఆపరేషన్ సింధూర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చిన భారత ప్రభుత్వం

ABN , First Publish Date - 2025-05-09T18:09:44+05:30 IST

భారత సరిహద్దుల్లో పాక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. గురువారం నాడు పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాక్‌ దాడులకు పాల్పడిందని, ఆ దాడులను డ్రోన్లతో తిప్పికొట్టామని చెప్పారు.

India Press briefing: ఆపరేషన్ సింధూర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చిన భారత ప్రభుత్వం
Operation Sindoor Latest Updates

Operation Sindoor Latest Updates: ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి భారత ప్రభుత్వం ఢిల్లీలో అప్డేట్స్ ఇచ్చింది. విదేశాంగ శాఖ నేతృత్వంలో నిర్వహించిన ఈ ప్రెస్‌ మీట్‌లో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాల్గొని వివరాలు వెల్లడించారు. కల్నల్ సోఫియా ఖురేషి అందించిన వివరాల ప్రకారం..


" భారత సరిహద్దుల్లో పాక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. పాక్‌ దాడులను డ్రోన్లతో తిప్పికొట్టాం. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాక్‌ దాడులకు పాల్పడింది. లేహ్‌ నుంచి సర్‌క్రీక్‌ వరకు 36 చోట్ల దాడులు చేసింది. కైనటిక్‌, నాన్‌ కైనటిక్‌ సాధనాలతో భారత్‌ పాక్ దాడుల్ని తిప్పికొట్టింది. పాక్‌ డ్రోన్లన్నీ టర్కీకి చెందినవి గుర్తించాం. బఠిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారు. అయితే, పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టాంమని" కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు.


"భారత మిలిటరీ బేస్‌లు టార్గెట్‌గా పాక్‌ దాడులు జరిగాయని సోఫియా ఖురేషి తెలిపారు. ఉత్తర ప్రాంతంలోని 26 ప్రదేశాలు టార్గెట్‌గా పాక్‌ దాడులు చేసిందని, పాక్‌ డ్రోన్లను భారత బలగాలు కూల్చివేశాయని వెల్లడించారు.


ఇక, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చెప్పిన వివరాల ప్రకారం "భారత్‌ దాడిలో పాక్‌కు తీవ్ర నష్టం కలిగింది. పౌర విమానాలను కవచంగా చేసుకుని పాక్‌ దాడి చేసింది. కరాచీ-లాహోర్‌ మధ్య విమానాలు తిరుగుతున్నాయి. మన వాయుసేన ఎంతో సంయమనం పాటిస్తోంది. ఎయిర్‌ స్పేస్‌ మూసివేసినట్లు పాక్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది." అని వ్యోమికా సింగ్‌ తెలిపారు.


ఇక, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇచ్చిన వివరాల ప్రకారం.. "గత రాత్రి పాకిస్థాన్‌ రెచ్చగొట్టే చర్యలకు దిగింది. పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం. పలు భారత నగరాలు లక్ష్యంగా పాక్‌ దాడులు చేసింది. నిన్నటి దాడుల్లో పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం జరిగింది. చాలా సార్లు పాక్‌ సీస్ ఫైర్ ఉల్లంఘనలకు పాల్పడింది. ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది. మతం రంగు పూసేందుకు పాక్‌ యత్నిస్తోంది. ప్రార్థనా మందిరాలపై దాడులు చేయలేదని పాక్‌ చెప్పడం అబద్ధం. భారత్‌పై పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. పూంఛ్‌లోని స్కూల్‌పై పాక్‌ దాడి చేసింది. దాడి సమయంలో స్కూల్‌ మూసివేసి ఉంది. మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు పాక్‌ కుట్ర చేస్తోంది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ మూసివేశాం. పాక్‌ దాడులను సమర్థంగా ఎదుర్కొన్నాం. పాక్‌ చర్యలపై మరోసారి IMFకు ఫిర్యాదు చేస్తాం. పాక్‌ ఎయిర్‌ స్పేస్‌ను మూసివేయలేదు. సింధు జలాల ఒప్పందం రద్దు చేశాం" అని విక్రమ్ మిస్రీ తెలిపారు.

Updated Date - 2025-05-09T19:58:05+05:30 IST