Gold and Silver Rates Today: ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Sep 02 , 2025 | 08:27 AM
బంగారం ధరలు నిత్యం హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లు, రూపాయి విలువ, డిమాండ్, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. సెప్టెంబర్ నెలలో దేశంలో పండుగలు, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు...
బిజినెస్ డెస్క్: నిన్న(సెప్టెంబర్ 1)తో పోలిస్తే ఇవాళ దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, రూపాయి-డాలర్ మారకం రేటు, రాబోయే పండుగల సీజన్ కారణంగా స్థానిక డిమాండ్ పెరుగుదల దీనికి కారణంగా చెబుతున్నారు. దేశంలో బంగారం, వెండి ధరలు గత కొన్ని వారాలుగా అనేక కారణాల వల్ల హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.
అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు, రూపాయి విలువలో మార్పులు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు, పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్, షేర్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.
ప్రధాన నగరాల్లో నేడు బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) రేట్లు ఈ దిగువ విధంగా ఉన్నాయి.
హైదరాబాద్: రూ.1,05,890.. రూ.97,060
విజయవాడ: రూ,1,05,890.. రూ.97,060
ఢిల్లీ: రూ.1,06, 040.. రూ.97,210
చెన్నై: రూ. 1,05,890... రూ.97,060
ముంబై: రూ. 1,05, 890 రూ.9,706
కోల్‌కతా: రూ. 1,05, 890.. రూ.97,060
బెంగళూరు: రూ.1,05,890.. రూ.97,060
కేరళ: రూ.1,05,890.. రూ.97,060
పూణే: రూ.1,05,890.. రూ.97,060
ఇక, ఈరోజు (2 సెప్టెంబర్ 2025) భారతదేశంలో వెండి ధర గ్రాముకు రూ. 126.10, కిలోగ్రాముకు రూ.1,26,100 గా ఉంది.
భారతీయ ప్రధాన నగరాల్లో ఈరోజు వెండి ధరలు ఇలా ఉన్నాయి:
ఆయా నగరాల్లో 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కిలో రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి..
హైదరాబాద్ : రూ.1,361 రూ. 13,610 రూ. 1,36,100
చెన్నై : రూ. 1,361 రూ. 13,610 రూ. 1,36,100
ముంబై : రూ. 1,261 రూ. 12,610 రూ.1,26,100
ఢిల్లీ : రూ. 1,261 రూ. 12,610 రూ. 1,26,100
కోల్‌కతా : రూ.1,261 రూ. 12,610 రూ. 1,26,100
బెంగళూరు : రూ. 1,261 రూ. 12,610 రూ. 1,26,100
కేరళ : రూ. 1,361 రూ. 13,610 రూ. 1,36,100
పుణే : రూ. 1,261 రూ. 12,610 రూ. 1,26,100
వడోదర : రూ. 1,261 రూ. 12,610 రూ. 1,26,100
అహ్మదాబాద్ : రూ. 1,261 రూ. 12,610 రూ. 1,26,100
ఈ వార్తలు కూడా చదవండి..