Share News

Former Punjab DGPs Son: కుమారుడు భార్యతో మాజీ డీజీపీ ఎఫైర్.. ప్రాణభయంతో కొడుకు..

ABN , Publish Date - Oct 22 , 2025 | 08:09 PM

ముస్తఫాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన శంషుద్దీన్ చౌదరి ఉన్నతాధికారులకు ఓ రిక్వెస్ట్ చేశాడు. ఆకిల్ వీడియోలు, డిజిటల్ ఎవిడెన్స్, కాల్ రికార్డ్స్, పోస్టు మార్టమ్ రిపోర్టును పరీక్ష చేయాలని కోరాడు.

Former Punjab DGPs Son: కుమారుడు భార్యతో మాజీ డీజీపీ ఎఫైర్.. ప్రాణభయంతో కొడుకు..
Former Punjab DGPs Son

పంజాబ్ మాజీ డీజీపీ మహ్మద్ ముస్తఫాపై పోలీస్ కేసు నమోదైంది. కోడలితో ఎఫైర్ పెట్టుకోవటంతోపాటు కుమారుడు మరణానికి కారణం అయ్యాడన్న ఆరోపణలతో ఆయనపై కేసు ఫైల్ అయింది. ముస్తఫాతో పాటు ఆయన భార్య మాజీ మినిస్టర్ రజియా సుల్తానా, కూతురు, కోడిలిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 16వ తేదీన ముస్తఫా కొడుకు ఆకిల్ అక్తర్ ఆపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందాడు. ఆకిల్ మృతిపై మొదట పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు.


అక్టోబర్ 17వ తేదీన ఆకిల్ స్నేహితుడు శంషుద్దీన్ చౌదరి మలెర్‌కోట్ల పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో చీకటి కోణాలు వెలుగు చూశాయి. శంషుద్దీన్ తన ఫిర్యాదులో.. ‘తన భార్యతో తండ్రికి అక్రమ సంబంధం ఉందని ఆకిల్ తెలుసుకున్నాడు. ఈ విషయం ఆకిల్ తల్లికి, సోదరికి కూడా తెలుసు. ఆ ఇద్దరూ కలిసి ఆకిల్‌ను చంపడానికి కుట్రలు చేశారు. చంపటం కుదరకపోతే తప్పుడు కేసులో ఇరికించాలని చూశారు. ఆకిల్‌కు ఏడేళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకు ఉన్నారు’ అని పేర్కొన్నాడు.


తనపై వస్తున్న ఆరోపణలపై డీజీపీ స్పందిస్తూ.. ‘నా కుమారుడు మానసిక పరిస్థితి సరిగా లేదు. 2008లో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. యాసిడ్ తాగాడు. దీంతో అతడి ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. గత సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నాడు’ అని చెప్పాడు. ముస్తఫాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన శంషుద్దీన్ చౌదరి ఉన్నతాధికారులకు ఓ రిక్వెస్ట్ చేశాడు. ఆకిల్ వీడియోలు, డిజిటల్ ఎవిడెన్స్, కాల్ రికార్డ్స్, పోస్టు మార్టమ్ రిపోర్టును పరీక్ష చేయాలని కోరాడు. ఇక, ఈ కేసుపై దర్యాప్తు చేయడానికి హర్యానా పోలీస్ శాఖ సిట్‌ను ఏర్పాటు చేసింది. శరవేగంగా దర్యాప్తు జరుగుతోంది.


ఇవి కూడా చదవండి

బాలికపై వృద్ధుడి అత్యాచారం.. నిర్ధారించిన పోలీసులు..

కాబోయే సీఎం ఆయనే.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య తనయుడు

Updated Date - Oct 22 , 2025 | 09:13 PM