Share News

Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీని చంపేసిన భార్య

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:13 AM

కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాశ్‌ను ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతి అనుమానాస్పదంగా హత్యచేశారని సమాచారం. ఆస్తి వివాదంతో ఈ దారుణ హత్య చోటు చేసుకోవడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీని చంపేసిన భార్య

ముఖంపై కారం కొట్టి.. కత్తితో దాడి

ఓంప్రకాశ్‌ని చంపేశానంటూ మరో

ఐపీఎస్‌ భార్యకు ఫోన్‌ చేసిన వైనం

హత్యలో కుమార్తెకూ భాగస్వామ్యం

బెంగళూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాశ్‌(68) దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరు నగరం హెచ్‌ఎ్‌సఆర్‌ లే అవుట్‌లోని ఆయన నివాసంలోనే ఈ దారుణం జరిగింది. భార్య పల్లవి, కుమార్తె కృతి ఆయనను ముఖంపై కారం చల్లి కత్తితో పొడిచి చంపేసినట్టు తెలుస్తోంది. అనంతరం పల్లవి మరో ఐపీఎస్‌ అధికారి భార్యకు వీడియోకాల్‌ చేసి, రాక్షసుడిని చంపేశానంటూ మృతదేహాన్ని చూపించినట్టు సమాచారం. ఆస్తి తగాదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది. పల్లవి ఆదివారం సాయంత్రం ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా హెచ్‌ఎ్‌సఆర్‌ లే అవుట్‌ పోలీసులు ఆయన ఇంటికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. భార్య, కుమార్తెను బయటకు రావాలని పోలీసులు కోరినా చాలా సమయంపాటు వారు పైఅంతస్తులోనే ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఓంప్రకాశ్‌ 1981 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. తొలుత బళ్లారి జిల్లా హరపనహళ్లిలో ఏఎస్పీగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసి 2015 నుంచి 2017 వరకు కర్ణాటక డీజీపీగా వ్యవహరించారు. రిటైర్మెంట్‌ తర్వాత బెంగళూరులోనే నివసిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవని ఇరుగు పొరుగువారు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. భార్య, కుమార్తెను పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకెళ్లారు.


ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నాడని..

తన భర్త ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నాడని, తనను చంపేస్తాడని భయంగా ఉందంటూ ఓంప్రకాశ్‌ భార్య పల్లవి మూడు రోజుల క్రితం ఐపీఎస్‌ ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌లో మెసేజ్‌ పెట్టారు. తనను, కుమార్తెను వేధిస్తున్నాడని, షూట్‌ చేస్తానంటూ హింసిస్తున్నాడని పేర్కొన్నారు. ఆయనపై సుమోటో కేసు నమోదు చేయాలని ఆ మెసేజ్‌లో ఆమె డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్


Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 04:13 AM