Share News

K Kasturirangan Passes Away: ఇస్రో మాజీ చైర్మన్ కె.కస్తూరిరంగన్ కన్నుమూత

ABN , Publish Date - Apr 25 , 2025 | 01:42 PM

K Kasturirangan Passes Away: ఇస్రో మాజీ చైర్మన్ కె. కస్తూరి రంగన్ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కస్తూరిరంగన్ బెంగళూరులో తుది శ్వాస విడిచారు.

K Kasturirangan Passes Away: ఇస్రో మాజీ చైర్మన్ కె.కస్తూరిరంగన్ కన్నుమూత
K Kasturirangan Passes Away

బెంగళూరు, ఏప్రిల్ 25: ఇస్రో మాజీ చైర్మన్ కె. కస్తూరి రంగన్ (84) ( Former ISRO chairman K Kasturi rangan) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కస్తూరి రంగన్ ఈరోజు (శుక్రవారం) బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, అంతరిక్ష కమిషన్‌ చైర్మన్‌గా, అంతరిక్ష శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. దాదాపు 9 సంవత్సరాల పాటు ఇస్రో చైర్మన్‌గా పనిచేసిన కస్తూరి రంగన్..అంత‌రిక్ష రంగంలో భార‌త్‌ను అత్యున్న‌త స్థాయికి తీసుకెళ్లారు. ఆగస్టు 27, 2003న ఆయన పదవీ విరమణ చేశారు. క‌స్తూరి రంగ‌న్ కేర‌ళ‌లోని ఎర్నాకుళంలో జ‌న్మించారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా పనిచేశారు. అంతేకాకుండా కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా కూడా విధులు నిర్వహించారు కస్తూరి రంగన్.


2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అలాగే భారత ప్రణాళికా సంఘం సభ్యుడిగా కూడా కస్తూరి రంగన్ పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్‌గా కూడా కస్తూరి రంగన్ విధులు నిర్వహించారు. ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ విభూష‌ణ్ అవార్డులను కస్తూరి రంగన్ అందుకున్నారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో (PM Narendra Modi) పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏప్రిల్ 27న ఆయన భౌతికకాయన్ని సందర్శనార్థం రామన్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్‌లో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఎమ్మెల్యే అరెస్ట్

Pahalgam Terror Attack: పాక్‌పై భారత్ ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు ఏవంటే..

Read Latest National News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 02:02 PM