Share News

ICAR: వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యప్పన్‌ అనుమానాస్పద మృతి

ABN , Publish Date - May 12 , 2025 | 05:16 AM

ఐసీఏఆర్‌ మాజీ డైరెక్టర్ జనరల్ అయ్యప్పన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. మండ్య జిల్లాలోని కావేరి నదిలో ఆయన మృతదేహం లభ్యమయ్యింది, మైసూరు పోలీసులు విచారణ చేపట్టారు.

ICAR: వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యప్పన్‌ అనుమానాస్పద మృతి

బెంగళూరు, మే 11(ఆంధ్రజ్యోతి): కర్ణాటకకు చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ అయ్యప్పన్‌(70) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మండ్య జిల్లా శ్రీకంగపట్టణ తాలూకా కావేరి నదిలో ఆయన మృతదేహం శనివారం లభించింది. మైసూరులోని విద్యారణ్యపుర పోలీ్‌సస్టేషన్‌లో అయ్యప్పన్‌ కనిపించడం లేదని ఈ నెల 8న కేసు నమోదైంది. మైసూరులోని అపార్ట్‌మెంట్‌లో భార్యతోపాటు నివసిస్తున్న ఆయన ఈ నెల 7న ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి అయ్యప్పన్‌ కనిపించడం లేదు. .


Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్

Updated Date - May 12 , 2025 | 05:16 AM