Share News

Home Minister: తేల్చిచెప్పేశారు.. విదేశీ మత ప్రచారాలు నిషిద్ధం..

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:10 PM

బెంగళూరు ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో ఈనెల 5, 6 తేదీలలో జరిగే అంతర్జాతీయ మిలాద్‌-ఉన్‌-నబి సమ్మేళనంలో విదేశీ ధర్మగురువులు భారత్‌లో ధార్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యం వహించడం, మత ప్రచారాలు చేయడం నిషేధంగా ఉందని హోం మంత్రి పరమేశ్వర్‌ స్పష్టత ఇచ్చారు.

Home Minister: తేల్చిచెప్పేశారు.. విదేశీ మత ప్రచారాలు నిషిద్ధం..

- హోం మంత్రి పరమేశ్వర్‌

బెంగళూరు: బెంగళూరు ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో ఈనెల 5, 6 తేదీలలో జరిగే అంతర్జాతీయ మిలాద్‌-ఉన్‌-నబి సమ్మేళనంలో విదేశీ ధర్మగురువులు భారత్‌లో ధార్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యం వహించడం, మత ప్రచారాలు చేయడం నిషేధంగా ఉందని హోం మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) స్పష్టత ఇచ్చారు. గురువారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్యాలెస్‌ మైదానంలో మిలాద్‌-ఉన్‌-నబి సమ్మేళనానికి భారత గ్రాండ్‌ ముక్తిషేక్‌ అబూబకర్‌ అహ్మద్‌ ముస్లియార్‌తోపాటు యెమెన్‌ సూఫీసంత్‌ హబీబ్‌ ఉమర్‌లను ఆహ్వానించారు.


pandu1.2.jpg

ఈ మేరకు విదేశీ ధర్మగురువులు ఇక్కడ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించరాదని, ఇది వీసా నియమాలకు ఉల్లంఘన కానుందని నిర్వాహకులకు సూచించామన్నారు. భారతదేశ చట్టాలకు అనుగుణంగా విదేశీ ధర్మ గురువులు ప్రచారాలు చేయరాదన్నారు. వారిని ఆహ్వానించి ఉండవచ్చునని, నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరించరాదన్నారు. విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) కార్యక్రమాన్ని పర్యవేక్షించనుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 04 , 2025 | 12:10 PM