Share News

Operation Sindhur: దాడి తర్వాతే పాకిస్థాన్‌కు సమాచారం

ABN , Publish Date - May 27 , 2025 | 04:58 AM

ఆపరేషన్ సిందూర్ దాడులకు ముందుగా పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వలేదని జైశంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ నిలిపివేతకు అమెరికా జోక్యం ఉందని, పాక్‌తో నేరుగా మాట్లాడాలని సూచించిందని చెప్పారు.

Operation Sindhur: దాడి తర్వాతే పాకిస్థాన్‌కు సమాచారం

పాక్‌ అభ్యర్థన మేరకే ఆపరేషన్‌ సిందూర్‌ ఆపేశాం: విదేశాంగ మంత్రి జైశంకర్‌

న్యూఢిల్లీ, మే 26: ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా ఉగ్రస్థావరాలపై భారత్‌ జరిపిన దాడి గురించి పాకిస్థాన్‌కు ముందుగా తెలియజేయలేదని, దాడులు పూర్తయ్యాకే ఆ దేశానికి సమాచారం అందించామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పష్టం చేశారు. దాడుల అనంతరం ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశాకే పాకిస్థాన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవో)కు ఈ విషయం తెలియజేశామని ఆయన పార్లమెంటరీ సలహా కమిటీకి వెల్లడించారు. మంత్రి జైశంకర్‌ అధ్యక్షతన సోమవారం విదేశాంగ శాఖకు చెందిన పార్లమెంటరీ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జైశంకర్‌ మాట్లాడుతూ.. ఉగ్రస్థావరాలపై దాడులకు ముందే పాకిస్థాన్‌కు సమాచారం అందించారంటూ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నట్టు తెలిసింది. దాడుల విషయాన్ని ముందుగానే ఇస్లామాబాద్‌కు తెలియజేయాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గతంలో విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా, ఆపరేషన్‌ సిందూర్‌ నిలిపివేత, అమెరికా జోక్యం గురంచి సమావేశంలో ఎంపీలు అడిగిన అనేక ప్రశ్నలకు జైశంకర్‌ సమాధానమిచ్చారు. పాకిస్థాన్‌ వైపు నుంచి వచ్చిన అభ్యర్థన మేరకే ఆపరేషన్‌ సిందూర్‌ను నిలిపివేయాలని ద్వైపాక్షికంగా నిర్ణయం తీసుకున్నామని జైశంకర్‌ ఎంపీలకు స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ను నిలిపివేసేలా చూడాలని పాకిస్థాన్‌ అమెరికా సాయం కోరిందని, అయితే.. నేరుగా భారత్‌తో మాట్లాడుకోవాలని అమెరికా వారికి స్పష్టం చేసిందని తెలిపారు. మరోవైపు పాక్‌తో మాట్లాడాలని అమెరికా కూడా తమను కోరిందని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్

మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 27 , 2025 | 04:58 AM