Pamban Rail Bridge: పాంబన్ కొత్త వంతెన దాటిన తొలి నౌక ఏపీదే!
ABN , Publish Date - May 02 , 2025 | 05:35 AM
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘4 స్టార్’ నౌక తొలిసారిగా పాంబన్ కొత్త రైలు వంతెనను వాణిజ్యపరంగా దాటి చరిత్ర సృష్టించింది. తీవ్ర గాలుల కారణంగా ఆలస్యం అయినా, బుధవారం వంతెన తెరిచిన వెంటనే నౌక దాటిపోయింది.
చెన్నై, మే 1(ఆంధ్రజ్యోతి): రామేశ్వరం సమీపంలోని పాంబన్ కొత్త రైలు వంతెనను తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సరకుల నౌక దాటింది. విశాఖపట్టణం నుంచి ఏప్రిల్ 16వ తేదీన బయల్దేరిన ‘4 స్టార్’ అనే సరకుల నౌక పాంబన్ రైల్వే వంతెన దాటి కర్ణాటక రాష్ట్రం కార్వార్ హార్బర్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ నౌక 57.5 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పు, 833 టన్నుల బరువు కలిగి ఉంది. ఈ నౌక గంటకు 6 నాటికన్ మైళ్లు (11 కి.మీ) వేగంతో ప్రయాణించే సామర్ధ్యం కలిగి ఉండగా, బయల్దేరిన రోజు నుంచి బంగాళాఖాతంలో బలమైన ఈదురుగాలుల కారణంగా గంటకు 2 నాటికన్ మైళ్లు (3.68 కి.మీ) చొప్పున ప్రయాణించింది. అందువల్ల ఏప్రిల్ 23వ తేది పాంబన్ వంతెన దాటి వెళ్లాల్సిన నౌక 28వ తేదీకి పాంబన్ తీరానికి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం తొలిసారిగా వాణిజ్యపరంగా పాంబన్ కొత్త రైలు వంతెన, పాత రైలు వంతెన తెరవడంతో సరకుల నౌక దానిని దాటింది.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News