Share News

Leopard: ఎట్టకేలకు ‘చిరుత’ చిక్కిందోచ్..

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:59 PM

గడచిన నెల రోజులుగా ప్రజలను ముఖ్యంగా పశువుల యజమానులను, గ్రామస్థులను భయభ్రాంతులకు గురి చేసిన చిరుత(Leopard) బోనుకు చిక్కింది. రాయచూరు(Rayachuru) నగర సమీపం మలియాబాద్‌ అటవి ప్రాంతంలోని పలు సార్లు జంతువుల పై దాడి చేసి ఆవులు, మేకలు ఇతర వాటిని వేటాడి తిన్న చిరుత అటవి శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో బంధిగా పట్టుబడింది.

Leopard: ఎట్టకేలకు ‘చిరుత’ చిక్కిందోచ్..

రాయచూరు(బెంగళూరు): గడచిన నెల రోజులుగా ప్రజలను ముఖ్యంగా పశువుల యజమానులను, గ్రామస్థులను భయభ్రాంతులకు గురి చేసిన చిరుత(Leopard) బోనుకు చిక్కింది. రాయచూరు(Rayachuru) నగర సమీపం మలియాబాద్‌ అటవి ప్రాంతంలోని పలు సార్లు జంతువుల పై దాడి చేసి ఆవులు, మేకలు ఇతర వాటిని వేటాడి తిన్న చిరుత అటవి శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో బంధిగా పట్టుబడింది. ఆరు రోజుల క్రితం మలియాబాద్‌(Maliabad) సమీపంలోని గోశాల పై దాడి చేసిన చిరుత అక్కడి ఒక ఆవును చంపి తినడంతో ఒక్క సారిగా గ్రామస్థుల్లో కలకలం రేగింది.

ఈ వార్తను కూడా చదవండి: Google Pay: చేతబడి చేయాలంటూ జీ పే ద్వారా రూ.21 లక్షలు చెల్లింపు..


దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు నాల్గు చోట్ల బోన్లు అమర్చడమేగాక ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు(CCTV cameras) ఏర్పాటు చేసి చిరుత కదలికలను గమనించే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వేటుకొచ్చిన చిరుత అటవి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనులో బంధిగా చిక్కింది. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

pandu1.2.jpg


ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్‌?

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2025 | 12:59 PM