Share News

Rakesh Tikait: రాకేష్ తికాయత్‌‌పై దాడి యత్నం.. హహల్గాం వ్యాఖ్యల పర్యవసానం

ABN , Publish Date - May 02 , 2025 | 09:15 PM

రాకేష్ తికాయత్‌కు జనం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒక ఈవెంట్‌కు ఆయన హాజరైనప్పుడు జనం ఆయనపై ఆగ్రహంతో దూససుకువచ్చారు. ఈ గందరగోళంలో ఆయన తలపాగా కూడా కిందపడింది.

Rakesh Tikait: రాకేష్ తికాయత్‌‌పై దాడి యత్నం.. హహల్గాం వ్యాఖ్యల పర్యవసానం

ముజఫర్ నగర్: రైతు నేత, భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నాయకుడు రాకేష్ తికాయిత్‌ (Rakesh Tikait) ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ (Muzaffarnagar)లో జనాగ్రహం చవిచూశారు. జనం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒక ఈవెంట్‌కు ఆయన హాజరైనప్పుడు జనం ఆయనపై ఆగ్రహంతో దూససుకువచ్చారు. ఈ గందరగోళంలో ఆయన తలపాగా కూడా కిందపడింది. ఒక వ్యక్తి కర్రతో దాడికి పాల్పడినట్టు కూడా చెబుతున్నారు. అయితే పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు.

Shehbaz Sharif: భారత్‌లో పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ నిలిపివేత


జనాగ్రహానికి కారణం ఏమిటి?

పహల్గాం ఉగ్రదాడిపై తికాయత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. "ఈ సంఘటన వల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారు? హిందూ-ముస్లిం కార్డును ఎవరు ఆడుతున్నారు? సమాధానం వారిలోనే ఉంది. ఈ చర్యకు పాల్పడిన దొంగ పాకిస్తాన్‌లో లేడు, ఇక్కడే ఉన్నాడు" అని కూడా అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముజఫర్‌నగర్‌లో భారీ నిరసన నిర్వహించారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పబ్లిక్ యాంగర్ ర్యాలీ‌ తీయడంతో జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తికాయత్‌పై జనం దాడికి యత్నించడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.


ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను అత్యంత పాశవికంగా చంపడంతో దేశవ్యాప్తంగా పాకిస్థాన్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు కేంద్రం పలు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ఏఐఎంఐఎం, కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ ప్రధానమంత్రిని అభినందించాయి. ఇదే తరుణంలో పాక్‌ను సమర్ధిస్తూ, మోదీని విమర్శిస్తు్న్నట్టుగా తికాయత్ వ్యాఖ్యలు ఉండటంతో జనం అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.


ఇవి కూడా చదవండి..

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..

Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు

Updated Date - May 02 , 2025 | 09:16 PM