Share News

Girl shot by stalker: పట్టించుకోవడం లేదని కాల్చేశాడు.. 17 ఏళ్ల బాలికపై హత్యాయత్నం..

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:26 PM

దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్ నగరంలో ఒక దుండగుడు పట్టపగలు, నడిరోడ్డుపై 17 ఏళ్ల బాలికపై కాల్పులు జరిపాడు. కొన్ని రోజులుగా ఆ బాలికను జతిన్ అనే దుండగుడు వెంబడిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని వెంబడిస్తున్నాడు.

Girl shot by stalker: పట్టించుకోవడం లేదని కాల్చేశాడు.. 17 ఏళ్ల బాలికపై హత్యాయత్నం..
girl shot by stalker

దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్ నగరంలో ఒక దుండగుడు పట్టపగలు, నడిరోడ్డుపై 17 ఏళ్ల బాలికపై కాల్పులు జరిపాడు. కొన్ని రోజులుగా బాధిత బాలికను జతిన్ అనే దుండగుడు వెంబడిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఆ బాలిక పట్టించుకోకపోవడంతో ఈ దాడికి తెగబడ్డాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ బాలిక ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది (Faridabad shooting).


ఆ బాలిక తరచుగా లైబ్రరీకి వెళ్తుందనే విషయం తెలుసుకున్న జతిన్ సోమవారం సాయంత్రం మాటు వేశాడు. లైబ్రరీ బయట నాటు తుపాకీ పట్టుకుని కూర్చున్నాడు. బాధిత బాలిక తన స్నేహితులతో కలిసి లైబ్రరీ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో జతిన్ సంచిలోని తుపాకీ తీసి బాలికపై రెండు సార్లు కాల్చి అక్కడి నుంచి పారిపోయాడు. ఒక బుల్లెట్ ఆమె భుజంలోకి, మరో బుల్లెట్ ఆమె పొట్టలోకి వెళ్లి గాయపరిచాయి. స్థానికులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు (Faridabad crime news).


పోలీసులు కేసు నమోదు చేసుకుని హాస్పిటల్‌లోని బాలిక స్టేట్‌మెంట్ తీసుకున్నారు (stalker attack). తనపై కాల్పులు జరిపిన వ్యక్తి తనకు తెలుసని, ఎన్నో రోజుల నుంచి తనను అనుసరిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు బాలిక తెలిపింది. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ఆయుధాన్ని సంఘటన స్థలంలోనే వదిలి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. ఆ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓటర్ల సమస్యకు సత్వర పరిష్కారం

అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 04 , 2025 | 06:05 PM