Supreme Court: సుప్రీంకోర్టు ఎలాంటి తప్పు చేయలేదు
ABN , Publish Date - May 05 , 2025 | 05:10 AM
బిల్లుల ఆమోదంపై గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణయాల్లో గడువు విధించడం సబబేనని జస్టిస్ కె.ఎం.జోసెఫ్ అభిప్రాయపడ్డారు. వక్ఫ్ చట్టంపై పిటిషన్లను, ఈడీ అధికారాలపై పునర్విచారణను సుప్రీంకోర్టు విచారించనుంది.
బిల్లుల ఆమోదంపై కాలపరిమితి సబబే: జస్టిస్ కేఎం జోసెఫ్
కోచి, మే 4: రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై సంతకాలు చేసేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సబబేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం.జోసెఫ్ అన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం అవసరమని తెలిపారు. కోచిలో శనివారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ‘గవర్నర్ల అధికారాల్లో న్యాయ వ్యవస్థ’ పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. బిల్లుల ఆమోదంలో గవర్నర్ల పాత్ర పరిమితంగా ఉంటుందని తెలిపారు. కాగా, వక్ఫ్ సవరణ చట్టం-2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఇదిలా ఉండగా, అరెస్టులు, ఆస్తుల జప్తు విషయమై ఈడీకి ఉన్న అధికారాలను సమర్థిస్తూ 2022లో ఇచ్చిన తీర్పు సమీక్షించాలా.. వద్దా అన్నదానిపై నిర్ణయించేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News