Share News

Ennore TPP Construction Accident: చెన్నై ఎన్నోర్‌ పవర్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

ABN , Publish Date - Sep 30 , 2025 | 08:24 PM

చెన్నై ఎన్నోర్‌ పవర్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న కట్టడం కూలి 9 మంది కూలీలు మృతి చెందారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Ennore TPP Construction Accident: చెన్నై ఎన్నోర్‌ పవర్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
Ennore TPP Construction Accident

చెన్నై ఎన్నోర్‌ పవర్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న కట్టడం కూలి 9 మంది కూలీలు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదం ఎలా జరిగిందంటే.. మంగళవారం ఎన్నోర్‌ పవర్‌ ప్లాంట్‌లో ఆర్చ్ నిర్మాణం జరుగుతోంది. ఈ సమయంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది.


ఆర్చ్ ఒక్కసారిగా కుప్పకూలింది. 30 అడుగుల పైనుంచి కిందపడింది. శిథిలాల కింద పడి 9 మంది కార్మికులు చనిపోయారు. ఓ కార్మికుడు అత్యంత తీవ్రంగా గాయపడగా.. పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాయపడ్డ వారిని స్టేన్‌లీ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై ది అవదీ పోలీస్ కమిషనరేట్ స్పందిస్తూ.. ‘ఆర్చ్ ఎందుకు కూలిందో సరైన కారణంగా ఇంకా తెలియరాలేదు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము’ అని తెలిపింది.


ఇవి కూడా చదవండి

సుశాంత్ సింగ్ కేసు.. రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్

పీఓకేలో రెండో రోజూ కొనసాగిన నిరసనలు

Updated Date - Sep 30 , 2025 | 08:48 PM