Bombay HC Rhea Chakraborty: సుశాంత్ సింగ్ కేసు.. రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్
ABN , Publish Date - Sep 30 , 2025 | 08:02 PM
సుశాంత్ మరణంతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో 2020, సెప్టెంబర్ 8వ తేదీన హీరోయిన్ రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె పాస్ పోర్టును సీజ్ చేసింది. అయితే, 2020 అక్టోబర్ నెలలో ఆమెకు బెయిల్ వచ్చింది.
బాంబే హైకోర్టులో ప్రముఖ బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి భారీ ఊరట లభించింది. పాస్ పోర్ట్‌కు సంబంధించిన విషయంలో కోర్టు రియాకు సానుకూలంగా తీర్పునిచ్చింది. రియా పాస్ పోర్టును వెంటనే తిరిగి ఇచ్చేయాలని నార్కోటిక్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (NCB)ని ఆదేశించింది. ఇంతకీ సంగతేంటంటే.. ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020, జూన్ 14వ తేదీన తన ప్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది.
సుశాంత్ మరణంతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో 2020, సెప్టెంబర్ 8వ తేదీన హీరోయిన్ రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె పాస్ పోర్టును సీజ్ చేసింది. అయితే, 2020 అక్టోబర్ నెలలో ఆమెకు బెయిల్ వచ్చింది. కోర్టు కండీషన్ బెయిల్ మాత్రమే ఇచ్చింది. రియా పాస్ పోర్టు ఎన్‌సీబీ ఆధీనంలోనే ఉండాలని స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లాలనుకునే ప్రతీసారి ట్రైల్ కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. అయితే, తాజాగా, రియా చక్రవర్తి కోర్టులో పాస్ పోర్టు విషయమై పిటిషన్ వేసింది.
ఎన్‌సీబీ నుంచి తన పాస్ పోర్టు ఇప్పించమని కోరింది. మంగళవారం పిటిషన్‌పై జరిగిన విచారణలో రియా తరఫు న్యాయవాది రియాజ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘పాస్ పోర్టు సీజ్‌లో ఉండటం వల్ల రియా వృత్తి పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె తరచుగా షూటింగులు, ఆడిషన్స్, మీటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. కోర్టు పర్మీషన్‌తో పాస్ పోర్టు తీసుకోవడానికి చాలా సమయం పడుతోంది. దీంతో అవకాశాలు చేజారుతున్నాయి. బెయిల్ వచ్చినప్పటినుంచి రియా కోర్టు ధిక్కారానికి ఎప్పుడూ పాల్పడలేదు’ అని కోర్టుకు విన్నవించాడు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రియాకు సానుకూలంగా తీర్పు నిచ్చింది.
ఇవి కూడా చదవండి
రాగల 3 గంటల్లో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ఆంధ్రా యువతిపై తమిళనాడు పోలీసుల అత్యాచారం.. సోదరి కళ్లముందే..