Soldiers Injured: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్... మావోయిస్టు మృతి
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:36 AM
ఛత్తీస్‌గఢ్‌లో సుక్మా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఒకరు మృతి చెందాడు
ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు
చింతూరు, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లో సుక్మా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఒకరు మృతి చెందాడు. ఈనెల 28 నుంచి ఆగస్టు మూడు వరకు మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన క్రమంలో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. అదే సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను సుక్మా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో పేలుడు సామగ్రి, మావోయిస్టులు వినియోగించిన సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News