Share News

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మా పార్టీ వినాశనం అసాధ్యం

ABN , Publish Date - Jul 12 , 2025 | 10:49 AM

ప్రజాదరణతో రాజకీయాల్లో ముందుకు దూసుకెళ్తున్న అన్నాడీఎంకేను లేకుండా చేయడం ఎవరి తరము కాదని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి సవాలు విసిరారు. ‘మక్కలై కాప్పోం...తమిళగత్తై మీడ్పోం’ అనే పేరిట రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తొలివిడత ప్రచారంలో శుక్రవారం విల్లుపురం జిల్లాలో ఈపీఎస్‌ పర్యటించారు.

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మా పార్టీ వినాశనం అసాధ్యం

చెన్నై: ప్రజాదరణతో రాజకీయాల్లో ముందుకు దూసుకెళ్తున్న అన్నాడీఎంకేను లేకుండా చేయడం ఎవరి తరము కాదని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) సవాలు విసిరారు. ‘మక్కలై కాప్పోం...తమిళగత్తై మీడ్పోం’ అనే పేరిట రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తొలివిడత ప్రచారంలో శుక్రవారం విల్లుపురం జిల్లాలో ఈపీఎస్‌ పర్యటించారు. ఈ జిల్లాలోని విల్లుపురం, విక్రవాండి, దిండివనం నియోజకవర్గాల్లో ప్రజలను కలిసి అన్నాడీఎంకేకు మద్దతివ్వాలని అభ్యర్థించారు.


ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌ షోలో ఈపీఎస్‌ మాట్లాడుతూ... ప్రజాదరణ కోల్పోయిన డీఎంకే ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యులుగా చేర్చుకుంటున్న దుస్ధితి అన్నాడీఎంకే(AIADMK)కు రాలేదని, నాలుగేళ్ల డీఎంకే పాలనలో ప్రజలకు మొండిచెయ్యి చూపించడమే సాధించిన విజయమని వ్యాఖ్యానించారు. బీజేపీ దయతో అన్నాడీఎంకే ఉందని సీఎం స్టాలిన్‌ విమర్శిస్తున్నారని అయితే, కోట్లాది మంది కార్యకర్తలతో బలంగా ఉన్న పార్టీ కాబట్టే అన్నాడీఎంకే రాష్ట్రాన్ని సుమారు 30 ఏళ్లు పాలించి ప్రజలకు లబ్ది చేకూర్చిందన్నారు.


nani1.2.gif

ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులుగా పొడిగిస్తామన్న స్టాలిన్‌, ఆ మాట నిలబెట్టుకోలేదని, అదే విధంగా డీఎంకే పాలనకు నాలుగేళ్లు పూర్తయినా నీట్‌ రద్దు హామీ ఏమైందని, ఈ రకంగా ఓట్ల కోసం ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్న డీఎంకేకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుడ్‌ బై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈపీఎస్‌ అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి.

రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 12 , 2025 | 10:49 AM