Kejriwal: కేజ్రీవాల్‌పై క్రిమినల్ కేసు?
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:57 AM
శుక్రవారం ఆయన ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి ఈసీ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 11 గంటల్లోగా విషం కలిపిన ఆరోపణలపై సాక్ష్యాధారాలు సమర్పించకపోతే చర్యలు తీసుకుంటామని ఈసీ ఆదేశించడంతో కేజ్రీవాల్ ఎన్నికల అధికారులను కలిశారు.
అన్ని అవకాశాలు పరిశీలిస్తోన్న ఈసీ
మూడేళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం
న్యూఢిల్లీ, జనవరి31: యమునా నదిలో బీజేపీ విషం కలిపిందన్న ఆరోపణలపై ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెంద ని ఎన్నికల సంఘం ఆయనపై తగిన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. శుక్రవారం ఆయన ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి ఈసీ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 11 గంటల్లోగా విషం కలిపిన ఆరోపణలపై సాక్ష్యాధారాలు సమర్పించకపోతే చర్యలు తీసుకుంటామని ఈసీ ఆదేశించడంతో కేజ్రీవాల్ ఎన్నికల అధికారులను కలిశారు. అయితే ఆయన వివరణపై ఈసీ సంతృప్తి చెందలేదని తెలిసింది. కేజ్రీవాల్‌పై క్రిమినల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. భారతీయ న్యాయసంహితలోని సెక్షన్లు 196(రెండు వర్గాల మధ్య శతృ త్వం పెరిగేలా ప్రకటనలు చేసినందుకు), 197(జాతీయ సమైక్యతను దెబ్బతీసే యత్నం చేసినందుకు), 353(ప్రజలను మోసగించినందుకు), ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123(4)(తప్పుడు ప్రకటనలు చేసినందు కు) క్రిమినల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశముందని సమాచారం. బీఎన్‌ఎ్‌స సెక్షన్ల ప్రకారం మూడేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఆప్‌నకు ఏడుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై
మరో 4 రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఆప్‌లో కలకలం రేగింది. పార్టీకి ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. పార్టీతో పాటు, కేజ్రీవాల్‌పై విశ్వాసం కోల్పోయామని తమ రాజీనామా లేఖల్లో రాశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో మదన్‌లాల్, నరేశ్ యాదవ్, పవన్ శర్మ, రోహిత్, భావన, రాజేశ్ రిషి, బిజ్వాసన్ ఉన్నారు. వాస్తవానికి ఈ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించింది. ఢిల్లీలో 5న 70 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్
Parliament: శీతాకాల సభల్లో సెగలే!
Read Latest National News And Telugu News