Share News

EC Plans Nationwide: దేశమంతా సర్‌ ప్రక్రియ

ABN , Publish Date - Sep 07 , 2025 | 06:04 AM

ఓటరు సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను దేశమంతా అమలుచేసే ఆలోచనలో భారత ఎన్నికల సంఘం(ఈసీ) ఉంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత...

EC Plans Nationwide: దేశమంతా సర్‌ ప్రక్రియ

  • బిహార్‌ ఎన్నికల తర్వాత చేపట్టే యోచన?

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6 : ఓటరు సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను దేశమంతా అమలుచేసే ఆలోచనలో భారత ఎన్నికల సంఘం(ఈసీ) ఉంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియను సర్వత్రా చేపట్టాలని యోచిస్తోంది. దీనిపై ఈసీ అధికారికంగా ఇంతవరకు ప్రకటన చేయకపోయినా, ఎన్నికల సంఘం వర్గాల కథనాలు, మాత్రం ఇదే విషయం ధ్రువీకరిస్తున్నాయి. ఈ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ చానల్‌ కథనం ప్రసారం చేసింది. ఈ కథకాన్ని అనుసరించి.. ఈ నెల 10వ తేదీన రాష్ట్రాల/ కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులతో (సీఈవోలు) భారత ఎన్నికల సంఘం ఢిల్లీలో భేటీ కానుంది. ‘సర్‌’ ప్రక్రియను దేశమంతా విస్తరించడంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే వీలుంది. పది పాయింట్లపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌కు వీలుగా సిద్ధమై రావాలని సీఈవోలను ఈసీ ఆదేశించింది. అయితే, ఇవన్నీ ‘సర్‌’తో ముడిపడినవే కావడం గమనార్హం.. సీఈవోలు పనిచేస్తున్న రాష్ట్రం లేక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు... చివరిగా ‘సర్‌’ ప్రక్రియ అక్కడ ఎప్పుడు నిర్వహించారు.. తదితర అంశాలపై ప్రజంటేషన్‌ ఉండాలని ఈసీ నిర్దేశించింది.

ఇవి కూడా చదవండి..

తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్

For More National News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 07:14 AM