Share News

Government Hospital: ప్రభుత్వాస్పత్రిలోవిధులకు వైద్యుల డుమ్మా..

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:52 PM

ప్రభుత్వ ఆస్పత్రి(Porur Government Hospital)లో చికిత్స కోసం వెళ్ళిన తమిళ సినీ హాస్యనటుడు గంజా కరుప్పు అక్కడ వైద్యులు విధులకు హాజరు కాలేదని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Government Hospital: ప్రభుత్వాస్పత్రిలోవిధులకు వైద్యుల డుమ్మా..

- రోగుల్ని పట్టించుకునేవారే లేరు

- సిబ్బందిని నిలదీసిన నటుడు గంజా కరుప్పు

- రోగులతో కలిసి ఆందోళన

చెన్నై: పోరూరు ప్రభుత్వ ఆస్పత్రి(Porur Government Hospital)లో చికిత్స కోసం వెళ్ళిన తమిళ సినీ హాస్యనటుడు గంజా కరుప్పు అక్కడ వైద్యులు విధులకు హాజరు కాలేదని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో ఉన్న రోగుల బంధువులతో కలిసి ఆకస్మికంగా ధర్నాకు దిగారు. మంగళవారం ఉదయం గంజాకరుప్పు కాలినొప్పితో చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళారు. ఆ సమయంలో వైద్యులెవరూ లేకపోవడం గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Teachers: ‘కీచక టీచర్ల’ చిట్టా సిద్ధం..


చాలా సేపటివరకూ వేచిఉన్నప్పటికీ వైద్యులెవరూ రాలేదు. అదే సమయంలో కొన ఊపిరితో ఉన్న ఓ వృద్ధురాలిని తీసుకువచ్చారు. అంతేగాక కుక్కకాటుకు గురైన వ్యక్తి కూడా లబోదిబోమంటూ చికిత్స కోసం వచ్చాడు. కానీ డాక్టర్లు లేకపోవడంతో వారు కారిడార్‌లోనే వుండిపోవాల్సివచ్చింది. దీంతో ఆగ్రహం చెందిన గంజాకరుప్పు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వివాదానికి దిగడమే కాకుండా రోగుల బంధువులతో కలిసి ధర్నా చేశారు.


ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో పనిచేస్తూ లక్షలాది రూపాయలను జీతంగా తీసుకుంటున్న డాక్టర్లు ఉదయం 8 గంటలకు డ్యూటీకి హాజరుకావాల్సి ఉండగా మధ్యాహ్నం 3 వరకు ఆస్పత్రి ఛాయలకు కూడా రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చేరోగులకు చికిత్స చేసేందుకు ఆస్పత్రిలో అందుబాటులో ఎవరూ లేరని, ఈ విషయమై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తగు చర్యలు చేపట్టాలని గంజాకరుప్పు డిమాండ్‌ చేశారు.


ఈవార్తను కూడా చదవండి: Congress: మంత్రివర్గ విస్తరణపై కదలిక

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి

ఈవార్తను కూడా చదవండి: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 12 , 2025 | 01:10 PM