DRDO Hands: అణు జీవ రసాయన దాడులపైనా నిఘా
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:28 AM
భారత నౌకాదళం అమ్ముల పొదిలో అణు, జీవ, రసాయన ప్రమాదాలను సైతం గుర్తించి, అరికట్టే వ్యవస్థలు వచ్చి చేరాయి. స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ఆధునిక...
6 రక్షణ వ్యవస్థలను నౌకాదళానికి అందించిన డీఆర్‌డీవో
న్యూఢిల్లీ, జూలై 15: భారత నౌకాదళం అమ్ముల పొదిలో అణు, జీవ, రసాయన ప్రమాదాలను సైతం గుర్తించి, అరికట్టే వ్యవస్థలు వచ్చి చేరాయి. స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ఆధునిక సాంకేతికతను వినియోగించి రూపొందించిన ఆరు రక్షణ వ్యవస్థలను నౌకాదళానికి డీఆర్‌డీవో అందించింది. వీటిలో అణు, జీవ, రసాయన రక్షణ వ్యవస్థలు ఉన్నాయని, ఇవి వ్యూహాత్మక జాతీయ భద్రతలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని డీఆర్‌డీవో వెల్లడించింది. అదేవిధంగా నౌకాదళ సిబ్బంది గుణాత్మక అవసరాలకు ఇవి ఎంతగానో తోడ్పడనున్నాయని తెలిపింది. ఈ వ్యవస్థలను నౌకాదళ ప్రధాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో అడ్మిరల్ శ్రీరాం అముర్‌కు డీఆర్‌డీవో చైర్మన్, డీడీఆర్‌డీ సెక్రటరీలు అందించారు.
ఇవీ 6 వ్యవస్థలు
1) గామా రేడియేషన్ ఏరియల్ సర్వైవలెన్స్ సిస్టమ్(జీఆర్‌ఏఎ్‌సఎస్): తేలికపాటి గామా రేడియేషన్ మాడ్యూల్‌ను వినియోగించి రూపొందించిన ఈ వ్యవస్థ అణు స్థావరాలు, రేడియేషన్ ఉన్న ప్రాంతాల్లో సైతం వైమానిక రేడియలాజికల్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
2) ఎన్విరాన్‌మెంటల్ సర్వైవలెన్స్ వెహికల్(ఈఎ్‌సవీ): సంభావ్య ప్రమాదకర వాతావరణాల్లో కూడా అణు, జీవ, రసాయన ఆయుధాలను, దాడులను గుర్తిస్తుంది.
3) వెహికల్ రేడియలాజికల్ కంటామినేషన్ మానిటరింగ్ సిస్టమ్(వీఆర్‌సీఎంఎస్): అణుకలుషిత, రేడియలాజికల్‌గా ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే వాహనాలు, సిబ్బందిపై రేడియేషన్ ప్రభావాన్ని గుర్తిస్తుంది. అదేవిధంగా సర్వే చేసేందుకు ఉపయోగపడుతుంది.
4) అండర్ వాటర్ గామా రేడియేషన్ మానిటరింగ్ సిస్టమ్(యూజీఆర్‌ఎంఎస్): నీటి అడుగున గామా రేడియేషన్ స్థాయిలను అంచనా వేసి, డేటా బేస్ స్టేషన్‌కు చేరవేస్తుంది. పోర్టులు, తీరప్రాంతాలు, నేవీ కార్యకలాపాల్లో భద్రతకు దోహదపడుతుంది.
5) డర్ట్ ఎక్స్‌ట్రాక్టర్ అండ్ క్రాస్ కంటామినేషన్ మానిటర్(డీఈసీసీఓఎం): ప్రమాదకర పదార్థాలను బదిలీ చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీవ, రసాయన, రేడియాలజీ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ఇది ఉపయోగపడుతుంది. పాదరక్షల నుంచి కూడా కలుషితాలను సంగ్రహిస్తుంది.
6) ఆర్గాన్ రేడియాక్టివిటీ డిటెక్షన్ సిస్టమ్(ఓఆర్‌డీఎస్): మానవ అవయవాలలో రేడియోధార్మికత స్థాయిలను గుర్తిస్తుంది.
ఇవి కూడా చదవండి:
ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..
మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి