మూడు నెలల్లో సీఎంగా డీకే శివకుమార్
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:46 AM
కర్ణాటకలో సీఎం మార్పు జరుగుతుందా? ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య స్థానంలో కాంగ్రెస్ అధిష్ఠానం ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను...
సొంత పార్టీ ఎమ్మెల్యే హుస్సేన్ వ్యాఖ్యలు
బెంగళూరు, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో సీఎం మార్పు జరుగుతుందా? ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య స్థానంలో కాంగ్రెస్ అధిష్ఠానం ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కూర్చొపెట్టే ఆలోచనలో ఉందా? అంటే అవుననే అంటున్నారు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్! రామనగరలో ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2-3 నెలల్లో సీఎంగా సిద్దరామయ్య స్థానంలో డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనేలా మాట్లాడారు. ‘సమయం వచ్చినప్పుడు అధిష్ఠానం డీకే శివకుమార్‌కు అవకాశం ఇస్తుంది. అది ఈ ఏడాది జరిగే అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘సెప్టెంబరు తర్వాత రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయని కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. నేను డైరెక్టుగా చెబుతున్నా.. 2-3 నెలల్లో ఒక నిర్ణయం జరుగుతుంది’ అని డీకేకు సన్నిహితుడైన ఎమ్మెల్యే ఇక్బాల్ పేర్కొన్నారు.
Also Read:
యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
For More Telugu News