Crime: ఆస్తి కోసం అన్నను చంపిన చెల్లెళ్లు
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:16 AM
జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన జంగిలి బసవయ్య-లక్ష్మికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. చిన్న కుమారుడు ఇరవై ఏళ్ల క్రితమే మృతి చెందాడు.

వంద గజాల స్థలం కోసం కర్రలతో దాడి
జగిత్యాల జిల్లాలో దారుణం
జగిత్యాల క్రైం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): వంద గజాల స్థలం కోసం అన్నపై కర్రలతో దాడి చేసి హతమార్చారు ఇద్దరు చెల్లెళ్లు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన జంగిలి బసవయ్య-లక్ష్మికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. చిన్న కుమారుడు ఇరవై ఏళ్ల క్రితమే మృతి చెందాడు. పెద్ద కుమారుడు శ్రీనివాస్(52) ఆర్టీఏ ఏజెంట్‌గా పనిచేస్తూ హన్మాన్‌వాడలో నివాసం ఉంటూ తల్లిదండ్రుల ఆలనా పాలనా చూస్తున్నాడు. బసవయ్య పెద్ద కూతురు భారతపు వరలక్ష్మి భర్త చాలా ఏళ్ల క్రితం మృతిచెందగా సోదరుడు శ్రీనివాస్ కుటుంబంతోనే జీవిస్తోంది. చిన్న కూతురు వొడ్నాల శారదకు భర్తతో తగాదాలు రావడంతో అన్న ఇంటి పక్కనే అద్దె ఇంటిలో ఉంటోంది. బసవయ్య-లక్ష్మి దంపతులకు ఇల్లుతో పాటు పోచమ్మవాడలో వంద గజాల స్థలం ఉంది. వరలక్ష్మి, శారద తమకు ఆ స్థలాన్ని రాసి ఇవ్వాలని కోరుతూ తండ్రి, సోదరుడు శ్రీనివా్‌సను అడిగారు.
వారు ఒప్పుకోకపోవడంతో కొన్ని ఏళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం శ్రీనివాస్ తన తల్లిదండ్రులకు భోజనం అందించేందుకు పోచమ్మవాడకు వెళ్లాడు. అక్కడే ఉన్న వరలక్ష్మి, శారద స్థలం కోసం శ్రీనివా్‌సతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరు కలిసి కర్రతో తలపై దాడిచేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన శ్రీనివాస్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.