Share News

Punya Salila Srivastava : నూనె, చక్కెర బోర్డులు పెట్టండి

ABN , Publish Date - Jul 15 , 2025 | 04:36 AM

చిరుతిళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు వంటి వాటిలో..

Punya Salila Srivastava : నూనె, చక్కెర బోర్డులు పెట్టండి

  • చిరుతిళ్లపై కేంద్ర ఆరోగ్యశాఖ సూచన

న్యూఢిల్లీ, జూలై 14: చిరుతిళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు వంటి వాటిలో ‘చక్కెర, నూనె బోర్డు’లను ప్రదర్శించాలని సూచించింది. రోజువారీ తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే కొవ్వు, చక్కెర వంటి కీలక సమాచారాన్ని అందులో ప్రదర్శించాలని తెలిపింది. ఈ మేరకు గత నెల 21న ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ అన్ని విభాగాలకు లేఖ రాశారు. లెటర్‌ హెడ్లు, ఎన్వలప్‌ కవర్లు, నోట్‌ప్యాడ్లు, ఫోల్డర్లు వంటి అధికారిక పత్రాలు, స్టేషనరీపై ఆరోగ్య సందేశాలను ముద్రించాలని లేఖలో తెలిపారు. పని ప్రదేశాల్లో పౌష్టికాహారం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 04:36 AM