Thiruvananthapuram case: మహిళా న్యాయవాదిపై సీనియర్ న్యాయవాది భౌతిక దాడి
ABN , Publish Date - May 14 , 2025 | 10:12 PM
కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఒక సీనియర్ న్యాయవాది బాగోతం బయటపడింది. ఒక కేసు విషయమై మాటామాటా వచ్చి జూనియర్ మహిళా న్యాయవాదైన శ్యామిలిని తీవ్రంగా
Thiruvananthapuram case: కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఒక సీనియర్ న్యాయవాది బాగోతం బయటపడింది. ఒక కేసు విషయమై మాటామాటా వచ్చి జూనియర్ మహిళా న్యాయవాదైన శ్యామిలిని తీవ్రంగా కొట్టి, శారీరకంగా హింసించాడు సీనియర్ న్యాయవాది బెయ్లిన్ దాస్. అందుబాటులో ఉన్న మాప్ స్టిక్‌తో తన కోపాన్ని తీర్చుకున్నాడు. దీంతో ఈ మేరకు మహిళా న్యాయవాదైన బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. దీంతో సదరు సీనియర్ న్యాయవాది మీద భౌతికంగా దాడిచేసిన వ్యవహారంలో కేసు నమోదైంది. నిన్న మే 13న మరో జూనియర్ న్యాయవాదితో జరిగిన గొడవ జరిగిన తర్వాత దాస్ తనపై దాడి చేశాడని మహిళా న్యాయవాది ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
తిరువనంతపురంలోని ప్రముఖ న్యాయవాదైన సదరు బెయ్లిన్ దాస్ తరచూ జూనియర్ లాయర్ల పట్ల ఇలాగే ప్రవర్తిస్తుంటాడని, దాస్ తరచూ చిన్న సమస్యలపై కూడా జూనియర్ సహోద్యోగులపై విరుచుకుపడతాడని, ఇది వర్క్ చేసే చోట తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందని శ్యామిలి తన ఫిర్యాదులో పేర్కొంది. తీవ్రగాయాలపాలైన శ్యామిలి తాను చికిత్స పొందుతున్న మెడికల్ కాలేజీ ఆసుపత్రి వెలుపల మాట్లాడుతూ..బెయిన్ దాస్ తనపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని పేర్కొంది. తాను ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, పనిలో వచ్చిన విభేదాల కారణంగా గతంలోనూ తనపై దాడి చేశాడని ఆమె ఆరోపించింది. బెయిన్ దాస్ కొట్టిన దెబ్బలకు తినడం, మాట్లాడ్డం చాలా కష్టంగా ఉందని కనీసం తన బిడ్డకు పాలుకూడా ఇవ్వలేకపోతున్నానని ఆమె వాపోయింది. ఈ నేపథ్యంలో తిరువనంతపురం బార్ అసోసియేషన్ బెయిన్ దాస్‌ను సస్పెండ్ చేసి, ఈ ఘటనకు సంబంధించి అతని నుండి అధికారిక వివరణ కోరింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Monsoon Forecast: 16 ఏళ్ల తర్వాత దేశంలో మే 27 నాటికే వర్షాలు.. ఎక్కడెక్కడ ఎప్పుడంటే..
Bhargavastra: ఆకాశంలో శత్రు డ్రోన్‌లను నాశనం చేసే స్వదేశీ 'భార్గవస్త్ర' పరీక్ష సక్సెస్
Penny Stock: ఈ స్టాక్‌పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి