Gurmeet Ram Rahim: ఢిల్లీ ఎన్నికల వేళ డేరా బాబాకు మళ్లీ పెరోల్
ABN , Publish Date - Jan 29 , 2025 | 01:50 AM
అత్యాచారం, హత్య కేసుల్లో జీవితకాల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు 30 రోజుల పెరోల్ మంజూరయింది. ఆయన మంగళవారం ఉదయం 5.26 గంటలకు హరియాణాలోని సునారియా జైలు నుంచి విడుదలయ్యాడు.
చండీగఢ్, జనవరి 28: అత్యాచారం, హత్య కేసుల్లో జీవితకాల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు 30 రోజుల పెరోల్ మంజూరయింది. ఆయన మంగళవారం ఉదయం 5.26 గంటలకు హరియాణాలోని సునారియా జైలు నుంచి విడుదలయ్యాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాం రహీమ్‌కు పెరోల్ లభించడం గమనార్హం. గతంలో కూడా హరియాణా, పంజాబ్, రాజస్థాన్‌లలో జరిగిన స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలుమార్లు రాంరహీమ్‌కు 20 నుంచి 50 రోజులపాటు పెరోల్ లభించింది. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ పెరోల్ మీద విడుదలయ్యాడు. గత ఐదేళ్లలో మొత్తం 14సార్లు రాం రహీమ్‌కు పెరోల్ లభించింది. డేరా బాబాగా పేరొందిన ఈయనకు పంజాబ్,రాజస్థాన్,హరియాణాల్లో భారీగా అనుచరులు ఉన్నారు.