Share News

Delhi Secretariat sealed: ఢిల్లీ సచివాలయానికి తాళం.. ఫైళ్లు, రికార్డులు భద్రపరచాలని ఆదేశం..

ABN , Publish Date - Feb 08 , 2025 | 02:43 PM

ఆప్ అధినేత అయిన అరవింద్ కేజ్రివాల్ కూడా తన నిజయోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సచివాలయ ఉద్యోగులకు లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ సెక్రటేరియట్‌ను సీజ్ చేశారు. సచివాలయం నుంచి ఏ ఒక్క ఫైల్, రికార్డు, హార్డ్ డ్రైవ్ బయటకు వెళ్లకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

Delhi Secretariat sealed: ఢిల్లీ సచివాలయానికి తాళం.. ఫైళ్లు, రికార్డులు భద్రపరచాలని ఆదేశం..
Delhi Secretariat sealed

దాదాపు 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కమల దళం చేతికి చిక్కింది. వరుసగా రెండు సార్లు అధికారం అనుభవించిన ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం దిశగా సాగుతోంది. ఆప్ అధినేత అయిన అరవింద్ కేజ్రివాల్ కూడా తన నిజయోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సచివాలయ ఉద్యోగులకు లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ సెక్రటేరియట్‌ను సీజ్ చేశారు. సచివాలయం నుంచి ఏ ఒక్క ఫైల్, రికార్డు, హార్డ్ డ్రైవ్ బయటకు వెళ్లకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.


పదేళ్లుగా ఢిల్లీలో అధికారం చెలాయించిన ఆప్‌పై బీజేపీ కొన్నేళ్లుగా అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను జారీ చేశారు. గత ప్రభుత్వానికి సంబంధించి ఒక్క ఫైల్‌ కూడా బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. గతంలో పలు రాష్ట్రాల్లో అధికారం చేతులు మారినపుడు ఫైళ్లు చోరీకి గురవుతూ ఉంటాయి. ఢిల్లీలో అలా జరగకూడదని బీజేపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నోటీస్ జారీ చేశారు.


``ఎటువంటి ఫైల్స్, డాకుమెంట్స్, కంప్యూటర్ హార్డ్ వేర్ లాంటివి ఢిల్లీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నుంచి బయటికి తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఒకవేళ అత్యవసరమైతే జెనెరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో సెక్రటేరియట్‌కు చెందిన అన్ని విభాగాల అధిపతులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం`` అంటూ ఢిల్లీ గవర్నర్ కార్యాలయం నుంచి నోటీసు జారీ అయింది.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 03:22 PM