Share News

Delhi Child Assult Case: ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారం

ABN , Publish Date - Jun 09 , 2025 | 06:05 AM

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం జరిగింది. లైంగిక దాడికి గురై ప్రాణాలు కోల్పోయినతొమ్మిదేళ్ల బాలిక.. తన ఇంటికి సమీపంలోని మరో ఇంట్లోని సూట్‌కేస్‌లో శవమై కనిపించింది. న్యూఢిల్లీలోని దయాల్‌పూర్‌ ప్రాంతంలో శనివారం రాత్రి వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

Delhi Child Assult Case: ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారం

  • తమ ఇంటికి సమీపంలోని బంధువుల దగ్గరకెళ్లి ఒంటరిగా తిరిగొస్తున్న చిన్నారిపై అఘాయిత్యం

  • అదే ప్రాంతంలోని ఓ ఇంట్లో సూట్‌కేసులో లభ్యమైన మృతదేహం

న్యూఢిల్లీ, జూన్‌ 8: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం జరిగింది. లైంగిక దాడికి గురై ప్రాణాలు కోల్పోయినతొమ్మిదేళ్ల బాలిక.. తన ఇంటికి సమీపంలోని మరో ఇంట్లోని సూట్‌కేస్‌లో శవమై కనిపించింది. న్యూఢిల్లీలోని దయాల్‌పూర్‌ ప్రాంతంలో శనివారం రాత్రి వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. దయాల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఓ బాలిక తమ ఇంటికి సమీపంలో నివసించే బంధువులకు ఐసు ముక్కలు ఇచ్చేందుకు శనివారం సాయంత్రం ఏడు గంటలప్పుడు వెళ్లింది. అలా వెళ్లిన బాలిక ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు బాలిక కోసం గాలించడం మొదలుపెట్టారు. సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి బాలిక వెళ్లిందని తెలియడంతో దాని తాళం పగలుగొట్టి లోపలికి వెళ్లారు. ఆ ఇంట్లోని ఓ గదిలో రక్తం మరకలతో ఉన్న ఓ సూట్‌కేసు కనిపించడంతో దానిని తెరిచి చూడగా.. బాలిక కనిపించింది. రక్త గాయాలతో సూట్‌కేసులో అపస్మారక స్థితిలో బాలికను తండ్రి హుటాహుటిన సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. బాలిక అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన సమాచారంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, బాలిక మృతదేహం దొరికిన ఇంట్లోని వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉండగా... వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - Jun 09 , 2025 | 06:06 AM