Share News

Govt Bans Sports Activities: తారా స్థాయికి వాయు కాలుష్యం.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:27 PM

గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించే క్రీడలను నిర్వహించొద్దని ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లను ఆదేశించింది.

Govt Bans Sports Activities: తారా స్థాయికి వాయు కాలుష్యం.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Govt Bans Sports Activities

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకుంది. పలు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గత నెల ఢిల్లీ - ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోని 80 శాతం ఇళ్లలో విషపు గాలి కారణంగా కనీసం ఒక సభ్యుడు అనారోగ్యానికి గురైనట్లు సర్వేలు చెబుతున్నాయి. గాలి కాలుష్యం కారణంగా ప్రజల ఆయుర్దాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు రక్షణ లభించటం లేదు. మాస్కులు, ఎయిర్ ప్యూరిఫైయర్లు కొంత మేరకు మాత్రమే రక్షణ ఇస్తాయని, కాలుష్యాన్ని నియంత్రించడానికి పాలసీలో మార్పులు రావాలని వైద్యులు సూచిస్తున్నారు.


స్పోర్ట్స్ యాక్టివిటీస్‌పై నిషేధం..

కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్‌పై నిషేధం విధించింది. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుండటంతో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆపేయాలని రెండు రోజుల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. సాధారణంగా ఢిల్లీలోని స్కూల్స్ చలికాలంలో స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. కాలుష్యం పెరగటంతో నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించే క్రీడలను నిర్వహించొద్దని ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లను ఆదేశించింది.


పంట వ్యర్థాలను కాల్చటం వల్లే..

దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరిగిపోవటానికి పంట వ్యర్థాలను తగలబెట్టడం ప్రధాన కారణం అవుతోంది. ఢిల్లీ చుట్టు పక్కల ఉండే రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో పంట వ్యర్థాలను తగలబెడుతూ ఉన్నారు. దాని కారణంగా ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోంది. అధికారులు పోలీస్ కేసులు నమోదు చేస్తున్నా.. భారీ ఫైన్లు వేస్తున్నా కూడా రైతులు మారటం లేదు. పంట వ్యర్థాలను కాలుస్తూనే ఉన్నారు.


ఇవి కూడా చదవండి

యూరప్‌ను భయపెడుతున్న జనాభా తగ్గుదల.. 2100 నాటికి దారుణ పరిస్థితి..

తవ్వకాల్లో దొరికిన బంగారం కోసం ఘర్షణ.. రంగంలోకి దిగిన పోలీసులు

Updated Date - Nov 21 , 2025 | 12:33 PM