Share News

Delhi Assembly Elections : నిరుద్యోగులకు నెలకు రూ. 8,500

ABN , Publish Date - Jan 30 , 2025 | 03:58 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే కులగణన అమలు చేస్తామని, పూర్వాంచలీలకు ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని, చదువుకున్న నిరుద్యోగ యువతకు ఏడాది పాటు నెలకు

Delhi Assembly Elections  : నిరుద్యోగులకు నెలకు రూ. 8,500

మహిళలకు ప్రతినెలా రూ.2,500.. పింఛన్‌ రూ.5 వేలు

ఢిల్లీలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

న్యూఢిల్లీ, జనవరి 29: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే కులగణన అమలు చేస్తామని, పూర్వాంచలీలకు ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని, చదువుకున్న నిరుద్యోగ యువతకు ఏడాది పాటు నెలకు రూ.8,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అలాగే, మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ చేస్తామని, కుటుంబానికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని, రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని, ఉచిత రేషన్‌ కిట్లు కూడా పంపిణీ చేస్తామని, ఢిల్లీ నగరంలో 100 ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేసి, రూ.5కే భోజనం అందిస్తామని, యమునా నదికి ఇరువైపులా ఆక్రమణలు తొలగిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఆరోగ్యం, విద్య, మహిళా, మైనారిటీ, ఎస్సీ, పూర్వాంచలీ, ఎల్‌జీబీటీక్యూఐఏ అంశాలకు సంబంధించి మొత్తం 219 హామీలతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్‌ కమ్యూనికేషన్ల విభాగం ఇన్‌చార్జి జైరాం రమేశ్‌తో కలిసి ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్‌ విడుదల చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లకు నెలకు రూ.5 వేల పింఛన్‌, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33ు రిజర్వేషన్‌, ఉద్యోగాలు చేసే మహిళల కోసం మరిన్ని హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొంది. మరోవైపు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌(ఆమ్‌ఆద్మీ పార్టీ) మధ్య రహస్య పొత్తు ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇది ఢిల్లీపై డబుల్‌ ఆపదగా మారనుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఢిల్లీలోని కర్తార్‌ నగర్‌లో మోదీ ‘సంకల్ప ర్యాలీ’ నిర్వహించారు. ఢిల్లీ వైపు ప్రవహిస్తున్న యమునా నదిలో హరియాణా ప్రజలు విషం కలిపి ఢిల్లీవాసులను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కేజ్రీవాల్‌ నిందలు వేయడం ద్వారా హరియాణా ప్రజలతోపాటు భారతీయులందరినీ అవమానించారని మోదీ మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 03:58 AM